Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూలిన మూడంతస్తుల భవనం.. ఒకరి మృతి, చిక్కుకున్న ఆరుగురు

అసలే వర్షకాలం.. అపై వరదలు, పాత ఇళ్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని.. పురాతన భవనాలు కూల్చివేయాలని చెబుతోన్న అదే నిర్లక్ష్యం.. దీంతో భవనాలు కూలిపోవడం.. జనం చనిపోవడం జరుగుతుంది. తాజాగా హర్యానా గురుగ్రామ్‌లో కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఇదీ మాత్రం వర్షం వల్ల జరిగిందో, భవన నిర్మాణంలో లోపాల వల్లే జరిగిందో ఇప్పుడే తెలియలేదు. మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో ఒకరు చనిపోగా.. ఆరుగురు అందులో చిక్కుకున్నారు. ఖావస్‌పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయం నుంచి 20 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని డిప్యూటీ కమిషనర్ యాష్ గార్గ్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద అంబులెన్సులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని మొహరించారు. బయటకు తీసిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Three-storey building collapses in Gurugram, 1 dead

మూడు అంతస్తుల భవనాన్ని వేర్ హౌస్ కంపెనీ నిర్మిస్తుందని ప్రాథమికంగా తెలిసిందే. తమ కంపెనీ కార్మికుల ఇళ్లకు సమీపంలో భవనం కడుతున్నారని.. ఇంతలో ప్రమాదం జరిగిందని మనేసర్ డీసీపీ వరుణ్ సింగ్లా తెలిపారు. ఘటనా స్థలంలో 19 మంది కార్మికులు ఉండి ఉంటారని తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో 15 మంది వరకు కార్మికులు భవనంలో పనిచేస్తున్నారని వివరించారు. భవనం కూలిపోవడానికి కారణం ఏంటో తెలియరాలేదు.

వర్షాల వల్ల ప్రమాదం జరిగిందా అని అడిగితే.. కచ్చితంగా సమయం తెలియరాలేదు అని అధికారులు చెబుతున్నారు. భవనంలో నిర్మాణాత్మక లోపాలు కూడా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా.. శిథిలాల కింద చిక్కుకున్న వారిపై మాత్రమే ఉందని స్పష్టంచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+