
యువ నేతలకే టికెట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఖర్గే క్యాంపెయిన్, బీజేపీ, మోడీపై విసుర్లు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తర్వాత గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాను గనక కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపడితే యువకులకే పార్టీ టికెట్లు ఇస్తానని చెప్పారు. అలా చెప్పి.. యువ నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అధ్యక్ష పదవీ కోసం థరూర్‌తో ఖర్గే పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీ పదవీ చేపట్టనని చెప్పడంతోనే ఎన్నిక అనివార్యమైంది. సోనియా గాంధీ వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ పదవీ కోసం గెహ్లట్ పేరు వినిపించింది.. కానీ రాజస్థాన్ ఎమ్మెల్యేల తిరుగుబాటు చేయడంతో రేసు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఖర్గేకు గాంధీ కుటుంబం అండగా ఉందనే ప్రచారం జరుగుతుంది.

భేగంపేట ఎయిర్ పోర్టులో ఖర్గేకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి వారు గాంధీ భవన్ వెళ్లారు. ఖర్గేతోపాటు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నారు. ఖర్గేకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య స్వాగతం పలికారు. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
తమ పార్టీలో అధ్యక్ష పదవీకి ఎన్నిక జరుగుతుందని ఖర్గే తెలిపారు. బీజేపీలో ఆ స్వేచ్చ లేదని చెప్పారు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా.. అధ్యక్షులుగా ఎంపిక చేయబడ్డరని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ హయాంలో దేశం వెనకడుగు వేస్తోందని చెప్పారు. అన్నీ వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. తాము 70 ఏళ్లలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్, కంపెనీలను విక్రయిస్తోందని ఫైరయ్యారు.