నేడే సంపూర్ణ చంద్రగ్రహణం-సూపర్‌మూన్‌గా కనువిందు-భారత్‌లో ఏ టైమ్‌లో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే...
ఆకాశంలో నేడు అద్భుతం సాక్షాత్కరించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్‌గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలై.. సాయంత్రం 6.22గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాడు. సంపూర్ణ చంద్రగ్రహణం భారత్‌లో తూర్పు రాష్ట్రాలైన ఒడిశా,బెంగాల్,అండమాన్ నికోబార్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే... అది కూడా గ్రహణం చివరి ఘట్టాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.
Recommended Video

ఆ ప్రాంతాల్లో కనిపించే అవకాశం...
అగర్తలా,ఐజ్వాల్,కోల్‌కతా,చిరపుంజీ,కూచ్ బెహార్,డైమండ్ హార్బర్డి గా,గువాహటి,ఇంఫాల్,ఈటానగర్,కోహిమా,మాల్దా,లఖింపూర్,పోర్ట్ బ్లెయిర్,పూరి,షిల్లాంగ్,సిబ్ సాగర్,సిల్చార్ ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపించవచ్చునని చెబుతున్నారు. భారత్‌లో 3.15గంటల సమయంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించవచ్చునని చెబుతున్నారు. మొత్తం 5 గంటల పాటు ఉండే చంద్రగ్రహణంలో... పాక్షిక చంద్రగ్రహణం 2గంటల 53 నిమిషాలు,సంపూర్ణ చంద్రగ్రహణం కేవలం 14 నిమిషాలు మాత్రమే ఉండనుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం అంటే....
దక్షిణ అమెరికా,ఉత్తర అమెరికా, తూర్పు ఆసియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం,సూపర్ మూన్ కలిసి ఏర్పడటం గత ఆరేళ్లలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
సాధారణంగా సూర్యుడికి, చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు. ఆ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ పడి ఆకాశంలో చంద్రుడు కనిపించడు. దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.

సూపర్ మూన్ అంటే...
భూమికి చంద్రుడు అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు 'సూపర్ మూన్'గా పిలుస్తారు. సాధారణంగా భూమి చంద్రుల మద్య సరాసరి దూరం 384440 కి మీ. కానీ సూపర్ మూన్ సమయంలో చంద్రుడు భూమికి మరింత సమీపంలోకి వస్తాడు.ఆ సమయంలో చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 14శాతం పెద్దగా,30 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.కొన్ని సందర్భాల్లో సూర్య కాంతి నేరుగా భూమిపై పడి... పరావర్తనం ద్వారా చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. టెలీస్కోప్ ద్వారా ఆకాశంలో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications