వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యలో నిలిచిన కేబుల్ కారు.. గాలిలోనే ఇద్దరు.. సహాయక చర్యలు

|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్ పర్వాను వద్ద పర్యాటకుల కోసం కేబుల్ కార్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవాళ కేబుల్ కార్లలో జనం వెళుతున్నారు. మధ్యలో కేబుల్ కార్ ఆగిపోయింది. ఆ సమయంలో 11 మంది ఉన్నారు. వారి బాధ వర్ణణాతీతం.. సాంకేతిక సమస్యతో ఆ కేబుల్ కార్ ఆగిందని తర్వాత తెలిసింది.

వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. పోలీసులతోపాటు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగారు. టింబర్ ట్రయల్ ఆపరేటర్స్ ద్వారా సహాయ చర్యలు చేపడుతున్నారు. ట్రోలీ ద్వారా వారిని కిందకు దించుతున్నారు. ఇప్పటికే 9 మందిని సురక్షితంగా కిందకి దించారు.

two tourists stranded mid-air in cable car

కేబుల్ కార్‌లో చిక్కి రెండు గంటలు అవుతుంది. మిగిలిన ఇద్దరిని తీయడం ఇబ్బంది అయితే.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను తీసుకోనున్నారు. రక్షించిన వారిలో ఇద్దరు అస్వస్థతగా ఉన్నట్టు తెలిసింది.

1992 అక్టోబర్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అప్పుడు కూడా 11 మంది చిక్కుకున్నారు. తర్వాత వారిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది. ఇటు మరోవైపు ఏప్రిల్ నెలలో ముగ్గురు చనిపోయారు. జార్ఖండ్ డియోఘర్ జిల్లాలో 40 గంటలుగా కేబుల్ కారులో ఉన్నారు. అలా వారు నిరీక్షించి చనిపోయారు.

English summary
eleven tourists got stranded mid-air after their cable car developed technical snag in Himachal Pradesh's Parwanoo on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X