
పార్టీ పదవుల నుంచి తొలగింపు: షిండేపై ఉద్దవ్ చర్యలు
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గం ఏర్పాటు కాకపోయినా.. షిండే, ఫడ్నవీస్.. సీఎం, డిప్యూటీలుగా ప్రమాణం చేశారు. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాకరే రగిలిపోతున్నారు. అందుకే షిండేపై చర్యలు తీసుకున్నారు. శివసేన పార్టీలో షిండే పదవులు అన్నింటిని తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారని.. అందుకోసమే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరిద్దరీతో ప్రమాణం చేయించారు. సోమవారం బలపరీక్ష జరగనుంది. తమ బలం మరింత పెరుగుతుందని షిండే అంటున్నారు. 170 మంది సభ్యుల మద్దతు తమకు ఉందని అంటున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 39 మంది షిండేకు మద్దతుగా నిలిచారు. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం నిలదొక్కుకోలేకపోయింది. ఆయన రాజీనామా చేయగా.. వెంటనే ఫడ్నవీస్, షిండే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బల నిరూపణ తర్వాత.. మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు ఐటీ నోటీసులను పంపించారు. ఇదీ తనకు వచ్చిన లవ్ లెటర్ అని వృద్ద నేత పవార్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.