వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్ళెదుటే యువతి కిడ్నాప్ యత్నం... అయినా స్పందించని జనం!

ప్రస్తుత సమాజ పరిస్థితికి అడ్డం పడుతోన్న ఘటన ఇది. అందరూ చోద్యం చూశారేగానీ.. ఆపదలో ఉన్న ఆ యువతిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రస్తుత సమాజ పరిస్థితికి అడ్డం పడుతోన్న ఘటన ఇది. అందరూ చోద్యం చూశారేగానీ.. ఆపదలో ఉన్న ఆ యువతిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తనకు జరిగిన అవమానం కంటే కూడా ప్రమాదంలో ఉన్న వారిని కాపాడాలన్న సామాజిక స్పృహ ఎవరికీ లేకపోవడం ఆమె మనసును కలచివేసింది. ఈ ఘటన గురించి చాలా రోజులు ఒంటరిగా బాధపడిన ఆ యువతి చివరికి సామాజిక మాధ్యమంలో పంచుకుంది.

రాజస్థాన్ కు చెందిన ఓ యువతి (26) ఢిల్లీలోని గురుగ్రామ్ సైబర్ సిటీ సంస్థలో కన్సల్టెంట్ గా పని చేస్తోంది. ఇటీవల సెలవులకు సొంతూరు వెళ్ళిన ఆమె తిరిగి రాత్రి ఏడు గంటల సమయంలో గురుగ్రామ్ చేరింది.

ఓల్వో బస్సు నుంచి దిగి క్యాబ్ కోసం ప్రయత్నించింది. అప్పటికే చీకటి పడుతుండడంతో బస్సులో అయినా వెళ్దామని భావించి బస్ స్టాప్ వద్ద తానూ వెళ్ళాల్సిన బస్సు కోసం వేచి చూడసాగింది.

ఆ బస్ స్టాప్ లో ఇంకా కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఆఫీసుల నుంచి ఇల్లాజు తిరిగి వెళుతున్న వారితో ఆ ప్రాంతం బాగా రద్దీగా కూడా ఉంది. అదిగో.. ఆ సమయంలో జరిగింది ఈ దారుణం.

Unknown Persons tried for Girl Kidnap... No Response from Co-Passengers

హటాత్తుగా ఓ స్కార్పియో వచ్చి ఆ యువతి పక్కన ఆగింది. అందులో కూర్చున్న కొంతమంది యువకులు ఆమెను స్కార్పియోలోకి బలవంతంగా లాగేందుకు ప్రయత్నించారు. భయాందోళనలకు గురైన ఆ యువతి గట్టిగా కేకలు వేసింది.

అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారు చోద్యం చూశారేగాని వారిలోంచి ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు ముందుకు రాలేదు.. ఆమెను కాపాడే యత్నం చేయలేదు. దీంతో తనను తానే కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చిన ఆ యువతి స్కార్పియో డోర్ ను తన కాలితో గట్టిగా నొక్కిపెట్టి ఆ ఆగంతకుల బారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆ దుండగులు సదరు యువతిని రోడ్డుపైకి తోసేసి తమ వాహనంలో అక్కడ్నించి ఉడాయించారు. ఇంత సీన్ జరిగినా అక్కడున్న వారు కళ్ళప్పగించి చూశారేగాని.. ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు.

ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన ఆ యువతి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా రోజులు తనలో తానే కుమిలిపోయింది. ఆ ఆపద సమయంలో ఆ ఆగంతకుల వచ్చిన స్కార్పియో వాహనం వివరాలు కూడా ఆమె సరిగా గమనించక పోవడం వల్ల ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేక పోయింది. చివరికి ఓ రోజు తనకిలా జరిగిందంటూ ఫేస్ బుక్ లో తన బాధను వెళ్ళగక్కింది.

English summary
A Girl recently shared about a bad experience in her facebook post which the incident was happened in a delhi bustop. While she is waiting for bus Group of persons who came there in Scarpio vehicle was tried to kidnap her in front of co-passengers who also waiting in the same busstop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X