ఉన్నావ్ రేప్: 7రోజుల సీబీఐ కస్టడీకి నిందితుడు కుల్‌దీప్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 17ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్‌ను ఏడురోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగర్‌కు ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేసింది.

 Unnao rape case: Kuldeep Sengar sent to 7-day CBI custody

కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్‌ జిల్లా ఆసుపత్రికి చెందిన సూపరింటెండెంట్‌, క్యాజువాలిటీ అధికారిపై కూడా వేటువేశారు. సెంగర్‌ మీద సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. గత సంవత్సరం జూన్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని 17ఏళ్ల బాలిక ఆరోపించిన సంగతి తెలిసిందే.

కాగా, ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్ సెంగర్‌, అతడి అనుచరులు బాలికపై అత్యాచారం చేయడంతో పాటు, ఆమె తండ్రి మరణానికి కారకుడయ్యారని బాధిత కుటుంబం ఆరోపించింది. 'కేసులో వాస్తవాలు వెల్లడయ్యేవరకూ సీబీఐకు సహకరిస్తాం' అని ఎమ్మెల్యే తరపు న్యాయవాది అన్నారు. కాగా, మే 2న సీబీఐ ఈ కేసులో స్టేటస్ రిపోర్టు సమర్పించనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Kuldeep Sengar, one of the accused in the Unnao rape case, was on Saturday (April 14) sent to seven-day CBI custody. He was arrested by the CBI on Friday after over 15 hours of questioning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి