హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

UPSC 2021: టాపర్‌గా నిలిచిన శృతి శర్మ, సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ర్యాంకులు ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సోమవారం యూపీఎస్సీ టాపర్స్ 2021 జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. UPSC ఫలితాలు 2021 ఫలితాల్లో శ్రుతీ శర్మ అనే అభ్యర్థి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. AIR 1ని సాధించారు. ఆమె తర్వాత అంకితా అగర్వాల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో AIR 2 సాధించారు. కాగా, సివిల్స్ సాధించిన అభ్యర్థులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.

యూపీఎస్సీ 2021 టాపర్‌గా నిలిచిన శృతి శర్మ

యూపీఎస్సీ 2021 టాపర్‌గా నిలిచిన శృతి శర్మ

పూర్తి జాబితా అధికారిక వెబ్‌సైట్ - upsc.gov.inలో చూడవచ్చు. UPSC సివిల్ సర్వీస్ 2021 పరీక్షా ఫలితాలను ఈరోజు, మే 28, 2022న ప్రకటించింది. అభ్యర్థులందరూ తనిఖీ చేసేందుకు కమీషన్ అధికారిక UPSC వెబ్‌సైట్‌లో ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. శృతి శర్మ, అంకితా అగర్వాల్ తర్వాత, గామిని సింగ్లా AIR 3, AIR 4ను ఐశ్వర్య వర్మ దక్కించుకున్నారు. వివిధ IAS టాపర్లు, IPS, టాపర్లు, IFS, మరిన్ని పేర్లతో కూడిన UPSC టాపర్స్ 2021 పూర్తి జాబితా క్రింద అందుబాటులో ఉంచబడింది.


https://upsconline.nic.in/FR-CSM-21-engl-300522.pdf

సివిల్స్ కు ఎంపికైన 685 మంది అభ్యర్థులు

సివిల్స్ కు ఎంపికైన 685 మంది అభ్యర్థులు

మొత్తం 685 మంది అభ్యర్థులు IAS, IPS, IFS, భారత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ అనేక ఇతర శాఖల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. UPSC నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ అనే మూడు రౌండ్‌లలో వారి పనితీరు ఆధారంగా టాపర్‌లను ఎంపిక చేశారు. కాగా, జనరల్‌ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా, మరో 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు


సివిల్స్‌ 2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు సాధించగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు సాధించారు. సివిల్స్ సాధించిన అభ్యర్థులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
UPSC 2021: Shruti Sharma tops Civil Services Final result, Telugu candidates got good ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X