ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి: లండన్‌లో ఆకస్మిక ల్యాండింగ్

Subscribe to Oneindia Telugu

లండన్: ఎయిర్ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ పక్షి ఢీకొనడంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన చోటుచేసుకుంది.

లండ‌న్‌లోని హీత్రూ విమానాశ్ర‌యంలో విమానం దించారు. ప‌క్షి ఢీకొన‌డంతో విమానం ముక్కు భాగం లోప‌లికి వెళ్లిపోయింది. దీంతో పాటు ఆ విమానానికి చెందిన రాడార్ వ్య‌వ‌స్థ కూడా దెబ్బ‌తింది. వాస్త‌వానికి ఎయిర్ ఇండియా విమానం అహ్మాదాబాద్ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళ్లాల్సి ఉంది.

US-bound AI flight lands in London after bird hit

అయితే లండ‌న్‌లో ఈ విమానం నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికుల‌కు ఎయిర్ ఇండియా ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసింది. బుధ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆ విమానంలో సుమారు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం విమానానికి రిపేర్ జరుగుతోందని, లండన్ నుంచి ప్రయాణికులను అహ్మదాబాద్ తీసుకొస్తుందని అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
National carrier Air India on Thursday said its Ahmedabad-London-Newark flight was grounded in London after a bird hit the aircraft.
Please Wait while comments are loading...