వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం మినిస్టర్ అడ్వైజరీ పదవీకి విజయ్ కుమార్ రాజీనామా, ఇదే కారణమట..?

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు పదవీకి మాజీ ఐపీఎస్ అధికారి కే విజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఈయన గంధపు చెక్కల స్మగ్మర్ వీరప్పన్‌ను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రాజీనామా లెటర్‌ను సంబంధిత అధికారులకు అందజేశారు. ఢిల్లీలో గల తన నివాసాన్ని ఖాళీ చేసి చెన్నై వెళ్లిపోయారు. ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో తన బాధ్యతలకు రాజీనామా చేసి చెన్నైకి మకాం మార్చానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఎంహెచ్ఏ అధికారులు, తన సర్వీసులో సహకరించిన వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 vijay kumar resigned as a home minister security adviser post

వామపక్ష తీవ్రవాదంతోపాటు కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు విజయ్ కుమార్ ఇచ్చిన సలహాలు హెల్ప్ అయ్యాయి. జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా కూడా పనిచేశారు. వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చీఫ్‌గా పనిచేశారు.

అంతేకాదు చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, కశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. విజయ్‌కుమార్ అమలు చేసిన ప్లాన్‌లో చిక్కుకుని వీరప్పన్ 2004లో చనిపోయాడు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఆ తర్వాత కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు హోం శాఖ అడ్వైజర్‌గా ఉన్నారు. కానీ ఆయన రాజీనామా అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
k vijay kumar resigned as a home minister security adviser post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X