ట్వీట్లతో పందెంకోడి పంచ్: హీరో విశాల్‌పై రాజేందర్ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్కె నగర్‌లో పోటీ చేయడానికి తాను వేసిన నామినేషన్‌ తిరస్కరణపై హీరో విశాల్ తీవ్రంగా మండిపడ్డారు. డిసెంబర్ 5, 2016న అమ్మ (జయలలిత) మరణించిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం మరణించిందని విశాల్ ట్వీట్ చేశారు.

జరిగిన దానికి చింతిస్తున్నానని, 'ప్రజాస్వామ్యానికి నా నివాళి' అని ట్వీట్ పెట్టారు. దిగజారిన ప్రజాస్వామ్యం మరింత పతనానికి చేరుకుందని ఆయన అందులో వ్యాఖ్యానంచారు. ఈ వ్యవహారమంతా ఓ పొలిటికల్ గేమ్ అని విశాల్ అన్నారు.

ప్రజలనుద్దేశించి విశాల్ మరో ట్వీట్ కూడా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

 ప్రజలను ఉద్దేసించి చేసిన ట్వీట్

ప్రజలను ఉద్దేసించి చేసిన ట్వీట్

"ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని అంగీకరించారు. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశారు.

 విశాల్‌పై రాజేందర్ ఆగ్రహం

విశాల్‌పై రాజేందర్ ఆగ్రహం

విశాల్‌ ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధపడడంపై ప్రముఖ నటుడు, నిర్మాత టి. రాజేందర్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌పీసీ) జనరల్‌ సెక్రటరీగా ఉన్న విశాల్‌ ముందు తన పదవికి న్యాయం చేయాలని సూచించారు.

 విశాల్‌కు అందులో అనుభవం లేదు..

విశాల్‌కు అందులో అనుభవం లేదు..

విశాల్‌కు నామినేషన్‌ వేయడంలో అనుభవం లేదని, అందుకే ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయలేకపోయాడని రాజేందర్ అన్నారు ముందు విశాల్‌ టీఎఫ్‌పీసీ జనరల్‌ సెక్రటరీగా ఉన్న తన పదవికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాతల అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఆ తర్వాత కావాలంటే.. ఆయన ఆర్కే నగర్‌ నుంచి కాకపోతే అన్నా నగర్‌, కేకే నగర్ల నుంచి పోటీ చేసుకోవచ్చునని ఆయన అన్నారు దీని కన్నా ముందు విశాల్‌ టీఎఫ్‌పీసీ నిర్మాతలకు మంచి చేయాలని రాజేందర్‌ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో అన్నారు.

విశాల్ ఇలా మండిపాటు

విశాల్ ఇలా మండిపాటు

తన నామినేషన్‌ను తిరస్కరించడంపై విశాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సరైన సమాధానం కావాలని, కేవలం ఓ లేఖ ఇచ్చి నామినేషన్‌ రద్దు చేస్తున్నట్లు చెప్పలేరని, ఏం జరిగిందో అందరికీ తెలియాలని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Producer and actor Rajender opposed hero Vishal's effort to contest from RK Nagar in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి