హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్మణ్ ఖాతా హ్యాక్: నిందితుడి పేరు మీద 30 ఖాతాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 VVS Laxman
కోల్‌కతా/హైదరాబాద్: మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలు కాజేసిన నిందితుడు ఇజాజుల్ హక్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. గత నెల 31న లక్ష్మణ్ మెయిల్ ఐడిని హ్యాక్ చేయడం ద్వారా ఆయన ఖాతా నుంచి పది లక్షలను కోల్‌కత్తాలోని ఓ ఖాతాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

లక్ష్మణ్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించారు. కోల్‌కత్తాలోని నార్త్ బిదానా నగర్‌లోని ఓ అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం బృందం కోల్‌కత్తా వెళ్లింది. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో బ్యాంకు వద్ద వలపన్ని అజీజ్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం నిందితుడ్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టింది.

సైబరాబాద్ పోలీసులు నిందితుడు అజీజ్ ఉల్ షేక్‌ను తమకు అప్పగించాలని స్థానిక కోర్టు అనుమతి తీసుకుని నగరానికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నిందితుడు అజీజ్ గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

కాగా, తన పేరిట కోల్‌కతాలో 30 నుండి 40 ఖాతాలు ఉన్నాయని, వాటిలోకి ఎక్కడెక్కడి నుండో డబ్బులొస్తాయని, వాటిలో తనకు రెండు శాతం కమిషన్ ఇస్తారని ఇజాజుల్ పోలీసుల విచారణలో చెప్పాడు. బ్యాంకు ఖాతాల వివరాలన్ని రాజు అనే వ్యక్తికి తెలుసునని చెప్పిన ఇజుజుల్ ఆ రాజు ఎవరనే విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేదట.

మరోవైపు, ఒకటి రెండు రోజుల్లో సైబరాబాద్ పోలీసులు ఇజుజుల్‌ను హైదరాబాదులోని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు అతని కస్టడీ కోరే అవకాశముంది.

English summary
The Malda native, who was arrested for fraudulent withdrawal of money from VVS Laxman's account, was brought to the Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X