
VIRAL VIDEO: దూల తీరింది ఎదవకు, రైల్వే ప్లాట్ ఫాంపై ఆటో, కేసు
నిర్దేశిత సమయానికి బస్సు, రైలు రాకుంటే.. ఆ చిరాకే వేరు. అవును సిచుయేషన్ దారుణంగా ఉంటుంది. వెయిట్ చేసి.. చేసి చివరకు చిరాకుతో ఉంటారు. అయితే ముంబైలో గల కుర్లాలో ఓ ఘటన జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద కొందరు ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. అదీ ఎంతకీ రావడం లేదు.సరదా కోసం ఓ పని చేశారు. అదీ కేసు వరకు వెళ్లింది.

ప్లాట్ పామ్‌పైకి ఆటో
అయితే ప్లాట్ ఫామ్ పైకి ఆటోను తీసుకొచ్చారు. రైలు రావడం లేదని.. అందుకే ఆటోలో వెళతాం అని సంకేతం ఇచ్చారు. దానిని ముందుకు పోనిచ్చారు. తర్వాత వెనకకు తీసుకొని వచ్చారు. తర్వాత యూ టర్న్ చేసుకొని.. ముందుకు కదిలాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు.

సీరియస్ తీసుకున్న రైల్వే పోలీస్
ఘటనను రైల్వే పోలీస్ ఫోర్స్ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఈటో నడిపిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టామని.. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఆటో సీజ్ చేసి.. కుర్లా ఆర్పీఎఫ్ వద్దకు ఆటో డ్రైవర్‌ను తరలించారు. ఈ నెల 12వ తేదీన కుర్లా ప్లాట్ ఫామ్ నంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఏదో సరదాకి చేసి ఉంటారు. కానీ అదీ రైల్వే యాక్ట్ ప్రకారం నేరం.. అందుకే రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ట్రెండ్ కోసం
అవును.. ట్రెండ్ కోసం చేస్తే ఇలానే ఉంటుంది. చర్యలు తీసుకునే వరకు వెళుతుంది. ఇక రైల్వే కేసు అంటే మాములు విషయం కాదు. అవును ఏళ్ల పాటు ఆ కేసు కొనసాగనుంది. తెలంగాణలో ఉద్యమ సమయంలో కేసులతో.. నేతలు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.