ఈ రోజు గర్వంగానే ఉంది కానీ: పాక్ బలగాల దుశ్చర్యకు బలైన జవాను కొడుకు
న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్ జవాన్ నరేందర్ కుమార్ గొంతు కోసి దారుణంగా పాకిస్తాన్ ట్రూప్స్ చంపేసిన విషయం తెలిసిందే. జవాను గొంతు కోసి, కనుగుడ్లు పీకేసి దూరంగా విసిరేశారు. దీనిపై జవాన్ నరేంద్ర కుమార్ తనయుడు స్పందించారు.
Recommended Video

నా తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, ఈ రోజు తమకు చాలా గర్వంగా అనిపిస్తోందని, కానీ రేపటి మా పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ కుటుంబానికి ఎవరు దిక్కని అడిగారు. ఇది తమకు గర్వం కలిగించే విషయమని, దేశం కోసం ఇలా ప్రాణాలు అర్పించే అవకాశం అందరికీ రాదని, దీనిపై గర్వపడుతూనే ఉండలేమన్నారు.
ఈ రోజు గర్వంగా ఉందని,రేపు ఇంకొకరు మరణిస్తారని, మళ్లీ గర్వంగా అనిపిస్తుందని, రెండు మూజు రోజుల తర్వాత ఏం జరుగుతుందని, తమకు ఎలాంటి సాయం అందదని, నేను, నా సోదరుడు నిరుద్యోగులమని, మాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం తన తండ్రి... ఆయన చనిపోయారని, మాకు కావాల్సిన సాయాన్ని అధికారులు అందించాలని కోరారు.

పాకిస్తాన్ ట్రూప్స్ చేతుల్లో చనిపోయిన నరేందర్ కుమార్ స్వస్థలం హర్యానాలోని సోనిపట్. 1990లో బీఎస్ఎఫ్‌లో చేరారు. భార్య సంతోష్ దేవి. ఇధ్దరు కొడుకులు మోహిత్ కుమార్, అంకిత్ కుమార్.
జమ్ము వద్ద రామగఢ్ సెక్టారులో సరిహద్దు భద్రతాదళ హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న అతనిని పాక్ ట్రూప్స్ చంపేశాయి. అతనిని అపహరించి, మూడుసార్లు తుపాకీతో కాల్చి, ఘోరంగా గొంతు కోసి ప్రాణం తీశాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications