న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు కొందరికి చేదువార్త. కొత్త సంవత్సరం నుంచి బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ 8.0 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
తక్కువ ఆపరేటింగ్ విధానంతో పని చేస్తున్న ఫోన్లలో ఈ ఏడాది జూన్‌లోనే వాట్సాప్ సేవలు నిలిచిపోవాల్సి ఉంది. కానీ దానిని డిసెంబర్ 31, 2017 వరకు పొడిగించారు.

దీంతో మరో వారం మాత్రమే పని చేయనున్నాయి. నోకియా ఎస్40 ఫోన్లలో వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు వాట్సాప్ సేవలు లభిస్తాయి.
ఆండ్రాయిడ్ 2.3.7 అంతకన్నా పాత ఓఎస్‌లతో పని చేసే ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 వరకు వాట్సాప్ వినియోగించవచ్చు. 2017 జూన్ 30తో సింబియన్ ఎస్ 60 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!