వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ల కొరతకు అసలు కారణాలివే- కేంద్రం భయపడిందా ? ఆచితూచి ఆర్డర్లు అందుకే !

|
Google Oneindia TeluguNews

కరోనా కల్లోలం వేళ భారత్‌లో వ్యాక్సిన్ల కొరత అందరినీ వేధిస్తోంది. కేంద్రం మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనా తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లను సైతం వాయిదా వేసుకునేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో భారత్‌తో పాటు విదేశీ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటున్నా కొరత ఎందుకు ఉత్పన్నమవుతోందన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసుల వల్ల వ్యాక్సిన్ల కొరత వచ్చిందని కేంద్రం చెప్తున్న సాకులు అబద్దమేననే వాదన వినిపిస్తోంది.

వ్యాక్సిన్ల కొరత తీవ్రతరం

వ్యాక్సిన్ల కొరత తీవ్రతరం


దేశవ్యాప్తంగా రోజుకు సగటున మూడున్నర లక్షల కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన వ్యాక్సిన్లు కేవలం కోటి మాత్రమే. దీంతో ఇవి ఏమాత్రం సరిపోవని రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. ఈ తరుణంలో మూడో దశ వ్యాక్సినేషన్‌ను కేంద్రం తప్పనిసరిగా ప్రకటించాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని కేంద్రం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే వ్యాక్సినేషన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు కూడా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్లు ప్రకటించలేని దుస్ధితి నెలకొంది.

 వ్యాక్సిన్ల కొరతకు అసలు కారణాలివే

వ్యాక్సిన్ల కొరతకు అసలు కారణాలివే

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఇంత తీవ్రంగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే కారణమనే వాదన అంతకంతకూ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా రెండు కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఇప్పట్లో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉండదన్న తప్పుడు అంచనా కాగా.. రెండోది ప్రస్తుతం వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలతో దశాబ్దం క్రితం జరిగిన ఓ ఘటనే. అప్పట్లో ఆడిటర్లు ఇచ్చిన తప్పుడు నివేదికల కారణంగా దాదాపు రూ.30 కోట్లు కేంద్రం చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఈసారి వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది.

తొలి ఆర్డర్‌ 66 మిలియన్ల డోసులే

తొలి ఆర్డర్‌ 66 మిలియన్ల డోసులే

భారత్‌లో తొలి విడత వ్యాక్సినేషన్‌లో ముందుగా హెల్త్‌ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు ప్రాధాన్యమిచ్చారు. ఇలా 30 కోట్ల మందికి 66 మిలియన్ల డోసులు సరిపోతాయని కేంద్రం అంచనా వేసింది. ఇందుకోసం పీఎం కేర్స్‌ నుంచి రూ.1300 కోట్లు చెల్లించి 66 మిలియన్ డోసుల పంపిణీకి మాత్రమే కేంద్రం పార్మా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చింది. కానీ వీటిలోనూ చాలా వరకూ మిగిలిపోవడంతో వృథా అయ్యే పరిస్దితి వచ్చింది. చివరికి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఈ అపప్రద నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతే కాదు తర్వాత ఇచ్చే ఆర్డర్ల విషయంలోనూ వెనుకడుగు వేసింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వైనం

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వైనం

ఎప్పుడైతే తొలి విడత వ్యాక్సినేషన్‌కు ఆర్డర్‌ చేసిన డోసుల్లో వృథా జరిగిందో అప్పుడు కేంద్రం అప్రమత్తమై మిగిలిన డోసులకు ఆర్డర్ ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వహించింది. కానీ మార్చి రెండో వారంలో ఎన్నికలతో కరోనా విజృంభణ ప్రారంభం కాగానే కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే 56 మిలియన్ల కోవిషీల్డ్‌ డోసులకూ, 10 మిలియన్ల కోవాగ్జిన్ డోసులకూ చివరి నిమిషంలో ఆర్డర్ ఇచ్చింది. ఇంకా ఆ డోసులు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇవి మే మధ్యలో ఆయా సంస్ధల నుంచి ప్రభుత్వానికి చేరాల్సి ఉంది.

English summary
The central government's vaccine orders have been abysmally low even as pharma companies race to ramp up output to contain the fresh spread of coronavirus, once seemingly in retreat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X