రాజీనామాకు సిద్ధమన్న ముఖ్యమంత్రి -ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో సంక్షోభం -సోనియా రాహుల్ తో భగేల్ భేటీ
అంతర్గత అసమ్మతి అతి సహజ వ్యవహరంగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాల పరిష్కారాలపై హైకమాండ్ దృష్టిపెట్టింది. ఒక్కొక్కటిగా ఆయా రాష్ట్రాల్లో నేతల మధ్య నెలకొన్న తగాదాలను తీర్చుతోంది. ఛత్తీస్‌గఢ్ లో ఏర్పడిన సంక్షోభంపై ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మంగళవారం నాడు అధిష్టానాన్ని కలుసుకున్నారు..
ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు వ్యవహారంపై సీఎం భూపేష్ భగేల్ స్పందించారు. సీఎం పదవి నుంచి వైదొలగాలని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎప్పుడు కోరితే అప్పుడు తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోనియా, రాహుల్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తాను సీఎం పదవిలో కొనసాగుతానని వారు తనను వైదొలగాలని కోరితే పదవి నుంచి తప్పుకుంటానని తాను గతంలోనూ వెల్లడించానని ఆయన గుర్తుచేశారు.

పార్టీలో అధికార పోరుకు తెరదించేందుకు రాహుల్ గాంధీ మంగళవారం భగేల్, సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్‌లతో చర్చించిన అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రొటేషనల్ సీఎం అంశాన్ని తెరపైకి తెస్తున్నవారు రాజకీయ అస్ధిరత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని సింగ్ దేవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఇక రాహుల్‌తో జరిగిన భేటీలో పాల్గొన్న చత్తీస్‌ఘడ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ పునియా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించారని, నాయకత్వ మార్పు అంశం ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ వ్యవహరాలతోపాటు పంజాబ్ కాంగ్రెస్ లో కొనసాగుతోన్న సంక్షోభానికి కూడా అధిష్టానం దాదాపు తెరదించింది..
Recommended Video
వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే ఎదుర్కోబోతున్నట్లు, మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కెప్టెనేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీ హరీష్ రావత్ తెలిపారు. మంగళవారం 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం అమరీందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని హరీష్ రావత్‌కు విజ్ణప్తి చేసిన మరుసటి రోజే ఇంత పెద్ద ప్రకటన రావడం పట్ల పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications