చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

130 కి.మీ వేగంతో కారు.. టెకీలను ఢీ కొట్టడంతో, స్పాట్‌లో ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

అతి వేగం ఇద్దరు టెకీల ప్రాణం తీసింది. ఇద్దరూ మహిళలే కావడం విశేషం. వర్క్ ముగించుకొని ఇంటి వస్తోండగా ప్రమాదం కబళించింది. చెన్నైలో నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వారిలో ఒకరు చిత్తూరు కాగా.. మరొకరిదీ కేరళలో గల పలక్కడ్ అని పోలీసులు తెలిపారు. కారు వేగంగా నడిపి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన డ్రైవర్‌ మొతీశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎస్ లావణ్య, ఆర్ లక్ష్మీ ఇద్దరు హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్ కంపెనీలో ఆనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి 11.30 గంటలకు వారిద్దరూ ఇంటి వచ్చేందుకు బయలదేరారు. అయితే వారిని హోండా సిటీ కారు వేగంగా ఢీ కొట్టింది. కారును మోతీశ్ నడుపుతుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అందుకోసమే ఇద్దరు చనిపోయారు. ఒకరు స్పాట్‌లో చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Women Techies Killed By rash driving

చనిపోయిన వారి మృతదేహాలను ప్రభుత్వమే ఇంటికి చేర్చింది. ఐటీ కంపెనీ ఉన్న సముదాయాల్లో భారీగా నివాస గృహలు కూడా ఉన్నాయి. అక్కడ జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో పాదచారులు నడిచేందుకు ఇబ్బంది కలుగుతుంది. దీనిని ఆర్ అండ్ బీ పట్టించుకోవడం లేదు.

అందుకోసమే ప్రమాదం జరిగి, ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరూ చనిపోయారు. యాక్సిడెంట్‌కు ముమ్మాటికీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణం.. దానికి తోడు సరయిన జీబ్రా క్రాసింగ్ ఉంటే సరిపోయేది. లేదంటే బ్రిడ్జీలు నిర్మిస్తే సరిపోయేది. అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది.

English summary
software professionals were killed when they were hit by a speeding car while crossing the road at Chennai's IT corridor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X