జీరో ప్లస్ జీరో.. జీరోనే.. నిర్మల పద్దుపై చిదంబరం విసుర్లు, క్యాపిటలిస్ట్ బడ్జెట్ అంటూ విసుర్లు
నిర్మలమ్మ పద్దుపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఈ పద్దు పెట్టుబడిదారుల కోసం ప్రవేశ పెట్టిందని.. గతంలో ఎవరూ ఇలా చేయలేదన్నారు. ఉద్యోగులు కోల్పోయిన వారి గురించి ప్రస్తావించకపోవడం దారుణం అని ఆయన అభివర్ణించారు. ఎంఎస్ఎంఈ గురించి ప్రస్తావించకపోవడం దారునం అని పేర్కొన్నారు. కొలువు కోల్పోయిన వారికి సాయం లేదని.. కొత్తగా ఉద్యోగాల కల్పన లేదని చెప్పారు. జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో అని విరుచుకుపడ్డారు.

వారి కోసమే పద్దు..
పెట్టుబడి దారుల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టారని.. దీంతో సామాన్యులకు ఒరిగేదేమీ లేదని చిదంబరం ఫైరయ్యారు. క్రిప్టో కరెన్సీ.. ఇతర ప్రతిపాదనల వల్ల దేశంలోని 99.99 మందికి ప్రయోజనం లేదని విరుచుకుపడ్డారు. దేశంలో పేదల గురించి కేవలం రెండు సార్లు మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. ఇదీ క్యాపిటలిస్ట్ బడ్జెట్ అని.. దీనిని ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొన్నారు.

సారీ చెప్పండి..
ఇటు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా కూడా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను నిర్మలా సీతారామన్ అవమానపరిచారని ఆయన అన్నారు. నిర్మల బడ్జెట్‌ను రాహుల్ గాంధీ జీరో బడ్జెట్ అనగా.. అదీ యూపీ తరహా పద్దు అని నిర్మలా కౌంటర్ ఇచ్చారు. అంటే ఉత్తరప్రదేశ్ ప్రజలను ఇన్సల్ట్ చేశారని సుర్జేవాలా ప్రశ్నించారు. ఆ రాష్ట్రానికి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video

ఆశల పద్దు..
కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడానికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే సమయంలో దేశ అభివృద్ధి పై, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విషయాలపై దృష్టి సారించిన బడ్జెట్లో, వచ్చే మూడేళ్లలో భారత్ 400 కొత్త, ఇంధన-సమర్థవంతమైన వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో రైల్వే రంగాన్ని కొత్త పుంతలు తొక్కించటంలో భాగంగా నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications