ఆందోళన: 11మంది సౌదీ యురాజుల అరెస్ట్
దుబాయ్: సౌదీ అరేబియాలో రాజ వంశానికి చెందిన 11 మంది రాజకుమారులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అక్కడి న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రియాద్‌లో సౌదీ రాజుకు చెందిన ఓ రాజభవనం ఎదుట ఆందోళన చేసే ప్రయత్నం చేశారు.

అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ వెళ్లకపోవడంతో వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాజ కుటుంబానికి చెందిన భద్రత బలగాలు వారి అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ వెబ్‌సైట్లో వెల్లడించింది. ఈ 11 మంది రాకుమారులను అత్యంత భద్రత ఉండే హైర్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.
తమ బంధువుకు సంబంధించిన ఓ కేసు తీర్పులో పరిహారం ఇవ్వాలని, రాజ వంశీయులకు నీటి, విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించడాన్ని రద్దు చేస్తూ రాజు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications