హమాస్ పెద్ద తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్
Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ ఈ ఏడాది భారీ పురోగతిని సాధించింది. ఈ రెండు మిలిటెంట్ గ్రూపుల మూలాలను కత్తిరించింది. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కమాండర్లు మొదలుకుని అనేకమందిని మట్టుబెట్టింది. 2023 అక్టోబర్ లో తమదేశంపై దాడికి దిగినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోగలిగింది. అదే సమయంలో శాంతి ఒప్పందాలను సైతం కుదుర్చుకోగలిగింది గానీ అవి పెద్దగా ఫలించినట్లు కనిపించలేదు.
ఈ ఏడాది హమాస్ చీఫ్ కమాండర్ యాహ్యా సిన్వర్, ఆ తర్వాత అతని తమ్ముడు మహ్మద్ సిన్వర్ ను హతమార్చింది. ఈ ఏడాది మే 13వ తేదీన హమాస్ శిబిరాలపై నిర్వహించిన మిస్సైళ్ల దాడుల సందర్భంగా మహ్మద్ సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెట్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది అప్పట్లో. నాటి దాడుల్లో హతమైంది సిన్వరేనని నిర్ధారించుకుంది. గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించామని ఐడీఎఫ్ వివరించింది.

సిన్వర్ సోదరుల మృతితో హమాస్ కు దాదాపుగా నాయకత్వం లేకుండా పోయిందనుకున్నప్పటికీ.. ఆ తర్వాత పలువురు హమాస్ కు నాయకత్వాన్ని వహించారు. వారిని కూడా మట్టుబెడుతూ వచ్చింది ఐడీఎఫ్.యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు మహ్మద్. ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు సారథ్యాన్ని వహించాడు. సిన్వర్ తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా మరణించాడు నాటి దాడుల్లో.
హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 67,806 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 1,70,066 మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు అల్ జజీరా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని మొదటి దశ కాల్పుల విరమణకు ఈ ఏడాది అక్టోబర్ లో హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు ఆగలేదు.
మరో వైపు జూన్ 13న ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో భారీ వైమానిక దాడికి దిగింది. ఇరాన్ అణు కర్మాగారాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఉన్నత సైనిక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేంతో సహా ఇజ్రాయెల్ కు చెందిన పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడులలో 24 మంది చనిపోగా, సుమారు 1,272 మంది గాయపడ్డారు. 8,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇరాన్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘర్షణలో అమెరికా కూడా రంగంలోకి దిగి, మూడు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ప్రాంతీయ యుద్ధం భయాలు పెరిగాయి. ఈ సంక్షోభం సమయంలో చమురు ధరలు 6 శాతం వరకు పెరిగాయి. 12 రోజుల పాటు సాగిన భీకర దాడుల తర్వాత, జూన్ 24న ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
-
అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
"మార్చి" రౌండప్.. అబ్బో ఒక్క నెలలోనే ఇన్ని అనుకోలేదుగా..? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications