Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐరాస ప్రసంగంలో ఆఫ్ఘన్ పేరు పెట్టి మరీ ప్రస్తావించిన మోడీ: స్వార్థం కోసం వాడుకోవద్దంటూ వార్నింగ్

న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ ఊహించినట్టే- ఉగ్రవాదం అంశాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నితంగా హెచ్చరిక సందేశాలను కూడా పంపించారు. ఈ హెచ్చరిక సందేశాలు పరోక్షంగా పాకిస్తాన్‌, చైనాలను ఉద్దేశించినవే. తమ స్వార్థం కోసం ఏ దేశం కూడా ఆప్ఘనిస్తాన్‌ను వినియోగించుకోకూడదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఆప్ఘన్ నేలపై

ఆప్ఘన్ నేలపై

కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్ సమస్య అత్యంత సున్నితమైనదని అభివర్ణించారు. దాన్ని అంతే సున్నితంగా చూడాల్సిన, పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న ఈ సున్నిత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, తమ స్వార్థం కోసం వినియోగించుకోవడానికి ఏ దేశం కూడా ప్రయత్నించకూడదని అన్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలకు ఒక భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

వారికి సహకారం అవసరం..

వారికి సహకారం అవసరం..

ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అవాంఛనీయ పరిస్థితులు కావని, వారికి ప్రపంచ దేశాల నుంచి సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు. మహిళలు, పిల్లలు, మైనారిటీలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వారికి అవసరమైన సహాయాన్ని అందజేయడం ద్వారా ప్రపంచ దేశాలు తమ విధులను తాము నిర్వర్తించాలని సూచించారు. అక్కడి సున్నిత సమస్యను మరింత క్లిష్టతరం చేయడం, పరిష్కారానికి నోచుకోనిదిగా మార్చడం సహేతుకం కాదని అన్నారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు బలి కాకూడదు..

ఉగ్రవాద కార్యకలాపాలకు బలి కాకూడదు..

ఆప్ఘనిస్తాన్‌లో మారిన పరిస్థితులు.. చోటు చేసుకున్న పరిణామాలు ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువు కాకూడదని నరేంద్ర మోడీ అన్నారు. టెర్రరిజాన్ని ఒక పొలిటికల్ టూల్‌గా మార్చుకోకూడదని చెప్పారు. ఉగ్రవాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వారికి కూడా అది అత్యంత ప్రమాదకరమైనదేనని అన్నారు. ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు గానీ, దాన్ని వ్యాప్తి చెందడానికి గానీ ఆప్ఘనిస్తాన్ భూభాగం కేంద్ర బిందువు కాకూడదనే భరోసాను ప్రపంచ దేశాలకు ఇవ్వడం అత్యవసరమని పేర్కొన్నారు.

కఠిన ప్రశ్నలుగా

కఠిన ప్రశ్నలుగా

ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు అనేక కఠిన ప్రశ్నలను సంధిస్తున్నాయని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధం, ఉగ్రవాదం, అక్కడి తాజా పరిస్థితులు సమాధానాలు లేని కఠిన ప్రశ్నలను విసురుతున్నాయని చెప్పారు. సముద్రాలు అనేవి దేశ సార్వభౌమత్వానికి ప్రతీక అని, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాన్ని ఏ దేశానికి కల్పించకూడదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి చెప్పారు. మ్యారిటైమ్ సెక్యూరిటీ తక్షణ అవసరంగా మారిందని పేర్కొన్నారు.

స్పందించాల్సింది ఇప్పుడే..

స్పందించాల్సింది ఇప్పుడే..


ఆప్ఘనిస్తాన్‌లో చోటు చేసుకున్న పరిణామాలు, సముద్రాల దుర్వినియోగం వంటి పరిస్థితుల మధ్య ఐక్యరాజ్య సమితి క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి బాధ్యతను ఆయన గుర్తు చేశారు. మ్యారిటైమ్ సెక్యూరిటీ విషయంల ప్రపంచ దేశాలన్ని ముక్తకంఠంతో సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలు ఉమ్మడిగా సముద్ర భాగాలను పరిరక్షించుకోవడానికి గళమెత్తాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+