వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా..? కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

వరసగా వెలుగుచూస్తోన్న కుంభకోణాలు, నేతల తిరుగబాటుతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తలగ్గొరు. తన ప్రధానమంత్రి పదవీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గత 48 గంటల్లో దాదాపు 50 మంది మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇంటా బయట విమర్శలు రావడంతో జాన్సన్.. పదవీ నుంచి వైదొలుగుతానని స్పష్టంచేశారు. ఈ మేరకు గార్డియన్ రిపోర్ట్ చేసింది. అతని ప్రభుత్వంలో స్కామ్స్, నేతల తిరుగుబాటుతో.. జాన్సన్ ప్రధాని పదవీకి అర్హుడు కాదని మంత్రులు అంటున్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్‌ వరకు అతను ప్రధాని పదవీలో ఉంటారని తెలుస్తోంది. ఆ సమయంలో కొత్త నేతను ఎన్నుకుంటారని కన్జర్వేటివ్ పార్టీ ఇదివరకే తెలిపారు.

British PM Boris Johnson to step down

బోరిస్ జాన్సన్ క్రమంగా మద్దతును కోల్పోతున్నారు. 2019లో ఉన్న సభ్యులు/ మద్దతు ఇప్పుడు వెంట లేరు. అంతేకాదు బుధవారం ఆర్థికంత్రిగా నదీమ్ జహవీ పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్త మంత్రి కూడా ప్రధాని బోరిస్ జాన్సన్ పదవీ నుంచి వైదొలుగాలని అంటున్నారు. అంతేకాదు విద్యాశాఖ కార్యదర్శి మిచెల్ డొనెలాన్ కూడా అలానే డిమాండ్ చేశారు. చివరికీ ఆమెను రాజీనామా చేశారు. అంతకుముందు చట్టసభ సభ్యురాలికి సంబంధించి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాడు. బోరిస్ జాన్సన్ రెండేళ్ల పాలనలో భారీగా కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇదీ జనం, విపక్షాలే కాదు.. సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకతకు కారణమైంది. వారంతా రాజీనామా బాట పట్టడంతో.. జాన్సన్‌కు మరో ఆప్షన్ లేదు. గురువారం తర్వాత ఏ క్షణమైనా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసే అవకాశం ఉంది.

కమ్యూనిటీస్ సెక్రటరీ మైఖేల్ గోవ్ 2016లో జరిగిన బ్రెగ్జిట్ రిఫరెండం ప్రచారంలో బోరిస్‌ జాన్సన్‌కు అండగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య అంత బాగోలేదు. గోవ్ ఓ పాము వంటివాడని బోరిస్ సన్నిహితుడొకరు బ్రిటిష్ మీడియాతో అన్నారట. గోవ్ 2016, 2019లో కన్జర్వేటివ్ లీడర్‌షిప్ కోసం బోరిస్‌ జాన్సన్‌తో పోటీ పడ్డారు.
తనను పదవీ నుంచి తొలగించాలంటే మీ చేతులు రక్తంతో తడవాల్సిందేనని బోరిస్ జాన్సన్ తన సహచరులతో అన్నారని బ్రిటిష్ మీడియా చెబుతుంది.

English summary
British Prime Minister Boris Johnson has agreed to step down from the top post amid a spate of resignations from the Conservative government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X