అమెరికాను వణికిస్తోన్న కార్చిచ్చు, బూడిదైన వేల ఇళ్లు, స్మశానాన్ని తలపిస్తున్న నివాస ప్రాంతాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

శాన్‌ ప్రాన్సిస్కో : అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం కొనసాగుతోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతూ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.

అగ్ని మాపక సిబ్బంది రోజుల తరబడి శ్రమించినా కాలిఫోర్నియాలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటలు నింగికి ఎగిసిపడుతుండగా, మేఘాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. ఇప్పటి వరకు 23 మంది మరణించగా, వందలమంది గల్లంతయ్యారు.

కబళిస్తోన్న కార్చిచ్చు...

కబళిస్తోన్న కార్చిచ్చు...

అమెరికాను కొంత కాలంగా ప్రకృతి వైపరీత్యాలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఉత్తర కరోలినాలోని అడవుల్లో వ్యాపించిన కార్చిచ్చు సమీప ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ కార్చిచ్చు దాదాపు 23 మందిని కబళించింది. ఆయా అడవులకు సమీపంలో నివస్తున్న 20 వేల మందిని... అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 285 మంది గల్లంతైనట్లు సమాచారం.

వేల ఇళ్లు కాలి బూడిదయ్యాయి...

వేల ఇళ్లు కాలి బూడిదయ్యాయి...

కార్చిచ్చు మంటలకు సుమారు 15 వేల ఇళ్లు అగ్నికి ఆహుతయినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికాలోని అడవుల్లో కార్చిచ్చు సహజంగా వ్యాపించినా.. ఇంత స్థాయిలో ఆస్తి నష్టం జరగడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అడవులకు సమీపంలోని నగరాలైన నాపా, నవేదా, ఆరెంజ్‌, సోనోమా, యాబాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శాంతారోసాలోని కోఫే పార్క్ లో ఉన్న వేలాది ఇళ్లను అగ్నికీలలు తుడిచిపెట్టేశాయి.

భారీగా ఆస్తినష్టం...

భారీగా ఆస్తినష్టం...


ఉత్తర కరోలినాలో మొత్తం 94 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు దాదాపు 30 వేల ఎకరాల్లో వ్యాపించి ఉందని.. ఈ మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కరోలినా ఫారెస్ట్ అండ్‌ ఫైర్‌ ప్రొటక్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జానెట్‌ అప్టన్‌ తెలిపారు. ఆస్తి నష్టం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశముందని ఆమె అన్నారు.

సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి...

సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి...

ద్రాక్ష తోటలకు నెలవైన సొనోమా, నాప, యూబా ప్రాంతాల్లోని అడవుల్లో మంటలు విస్తరించాయి. దాదాపు 14 ప్రాంతాలలో ఈ మంటల తీవ్రత అధికంగా ఉంది. కాలిఫోర్నియా గవర్నర్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘‘ఈ కార్చిచ్చు ఇప్పటికే తీవ్ర నష్టం కలిగించింది. వేలాది మందికి ప్రమాదం పొంచివుంది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి..'' అని గవర్నర్‌ కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The flames are spreading fast, the firefighters are stretched thin and the blazes rampaging through Northern California's wine country are nowhere near containment. As the cluster of fires that has killed 23 people burns, officials ordered residents in some additional areas to get their bags ready in case they need to evacuate. At least 285 people are still missing in a blaze that has affected almost the entire community. And as sleep-deprived, soot-covered firefighters work to contain the wildfires, some of their homes are being devastated as well. "This is not easy for anybody. We have firefighters who've either lost their homes or who have family members who have lost their homes," said Jonathan Cox, Cal Fire battalion chief.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి