• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డేటా సైంటిస్ట్: ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న ఉద్యోగాలు

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
డేటాను పరిశీలిస్తున్న మహిళ

మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌లను పట్టుకునేందుకు, వ్యాపార పాఠాలను అవలోకనం చేసుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను వెతికి నియమించుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో డేటా సైంటిస్ట్ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది.

డేటా సైంటిస్టుల జీతాలు కూడా ఆరంకెల్లో ఉన్నాయి. డేటా సైన్స్ పనికి 60,000 పౌండ్ల నుంచి 1,50,000 పౌండ్ల (సుమారు రూ.60 లక్షల నుంచి రూ.15కోట్ల 25 లక్షలు) మధ్యలో జీతం ఉంటుందని రిక్రూట్‌మెంట్ సంస్థ పేజ్ గ్రూప్ తెలిపింది. అయితే, దేశం, కంపెనీ, అభ్యర్థి సామర్థ్యాలను బట్టి డేటా సైంటిస్ట్ జీతాల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు.

డేటా సైన్స్‌కు, డేటా విశ్లేషణకు మధ్య అస్పష్టత నెలకొని ఉంది.

"డేటా సైంటిస్ట్ అంటే ఏమిటో చెప్పేందుకు చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయని పేజ్ గ్రూప్‌లో టెక్నాలజీ స్పెషలిస్ట్ జేమ్స్ హాబ్‌సన్ చెప్పారు.

అయితే, ఈ ఉద్యోగానికి ఇచ్చే టైటిల్ ఏదైనా కూడా ఈ పని చేసే ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. కానీ, డేటా సైన్స్‌లో నైపుణ్యం ఉన్న వారి సంఖ్య డిమాండుకు తగినంతగా లేదు. సాధారణంగా ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ చేసిన వారిని ఎంపిక చేసుకుంటారు.

ఎడ్వర్డ్ గ్రీన్

పెరుగుతున్న అవకాశాలు

డేటా సైన్స్ రంగంలో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 37శాతం పెరుగుతున్నాయని అమెరికాలో కొత్తగా వస్తున్న ఉద్యోగాల గురించి 2020లో లింక్డిన్ ప్రచురించిన నివేదిక చెబుతోంది.

ఈ ఉద్యోగాల్లోకి కొత్తగా చేరేవారు సంప్రదాయ తరహాకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకిచ్చే జీతాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

అలా చేరినవారిలో ఎడ్వర్డ్ గ్రీన్, బలరాజ్ ఓట్స్ ఉన్నారు. అయితే, డేటా సైంటిస్టులమని చెప్పుకోవడానికి ఇద్దరూ సంకోచిస్తున్నారు.

15 ఏళ్ల వయసులో లండన్‌లోని గ్రేట్ ఆర్మోన్డ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో ఒక సంక్లిష్టమైన అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నప్పుడు డేటా సైన్స్‌తో గ్రీన్‌ ప్రయాణం మొదలయింది. ఆయనకున్న ఆరోగ్య సమస్యకు రెండున్నరేళ్ల వ్యవధిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

మనలో చాలా మంది అలాంటి కష్టాలను మర్చిపోవాలని అనుకుంటాం. కానీ, ఆ సమయమే టెక్నాలజీలో కెరీర్ ప్రారంభించడానికి ఉపయోగపడిందని గ్రీన్ అంటారు.

"నాకు మొదటిసారి ఆపరేషన్ జరిగిన రోజునే ఐ‌ప్యాడ్ విడుదల అయింది" అని చెప్పారు.

ఆయన హాస్పిటల్ పేషెంట్ కౌన్సిల్‌లో చేరి, ఐప్యాడ్ మీద రోగుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ఆ సమాచారాన్ని రోగులకు చూపించేందుకు ఉపయోగించవచ్చు. ఆయన చేసిన ఈ ప్రయోగం ఆయనను నేరుగా స్కూలు నుంచి ఐటీ రంగంలో అడుగుపెట్టేటట్లు చేసింది.

ఎఫ్ 1 అప్లికేషన్ పిట్ స్టాప్ మెళకువల ద్వారా ఐసీయూ లోపలికి వెళ్లేవారు, బయటకు వచ్చేవారి వివరాలను సేకరించేందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ మెక్ లారెన్‌తో కలిసి గ్రీన్‌ అధ్యయనం చేశారు.

మోటార్ రేసింగ్ కార్ల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించే మెక్ లారెన్ టెక్నాలజీ సెంటర్‌లో పని చేయాలని అనుకోవడమే గ్రీన్ వేసిన తరువాతి అడుగు.

ఎఫ్1 మోటార్ రేసింగ్

మెక్ లారెన్ సంస్థలో అమెరికన్ సంస్థ అల్టీరిక్స్ అభివృద్ధి చేసిన సెల్ఫ్ సర్వీస్ టూల్ డేటా సైన్స్ సాఫ్ట్‌వేర్‌‌ను ఉపయోగిస్తారు. ఇది డేటా సేకరణలో నైపుణ్యం సాధించేందుకు సహకరిస్తుంది.

డేటాను విశ్లేషించడానికి గ్రీన్ కూడా ఈ టూల్ సహాయంతోనే శిక్షణ పొందారు.

"మెక్ లారెన్ విషయానికొస్తే, ప్రతీ రేసుకు 1.5 టేరా బైట్‌ల డేటా సేకరిస్తుంది. కొన్నిసార్లు ఈ డేటా అవసరం లేదని రేసులో పాల్గొనే డ్రైవర్లు భావిస్తారు. కానీ, అది వారికి అవసరం" అని గ్రీన్ అన్నారు.

కాగ్నిజంట్ సంస్థలో భవిష్యత్తులో పని ఎలా ఉండబోతోందో యువాన్ డేవిస్ అధ్యయనం చేస్తున్నారు.

కాగ్నిజంట్ టెక్నాలజీ సేవలను అందించే సంస్థ. అయితే, ఈ రంగంలో కూడా అభిప్రాయాలు మారాయని ఆయన అంటారు.

"ఒకప్పుడు డేటా సైన్స్ ఆకర్షణీయమైన ఉద్యోగం కాదు. ఈ ఉద్యోగాన్ని పుస్తకాల పిచ్చి ఉన్నవారికే పరిమితమైనదానిగా చూసేవారు. కానీ, ప్రస్తుతం ఇది సృజనాత్మకంగా మారింది"

"మీరు కనిపెట్టిన విషయాన్ని అమ్మాలంటే, కమ్యూనికేషన్ చాలా అవసరం. అంటే డేటా చుట్టూ కథలు చెప్పాల్సిన అవసరం ఉంది"

హార్డ్ డేటా‌ను విశ్లేషించే వారి అవసరమెంత ఉందో, దాని చుట్టూ కథలు చెప్పగలిగే సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారికి కూడా అంతే మంచి భవిష్యత్తు ఉంది" అని ఆయన అంటారు.

"డేటా సైన్స్ ఉద్యోగం ఒక హైబ్రిడ్ పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక నమ్మశక్యమైన సలహాదారుగా పని చేస్తోంది.

బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లకు ముఖ్యమైన విషయాలను చెప్పగలిగే విధంగా సమాచారాన్ని డేటా సైంటిస్ట్ అర్థం చేసుకోగలిగి ఉండాలి.

"క్లిష్టమైన సమాచారాన్ని సరళమైన చిత్రాలుగా మార్చే డేటా విజువలైజేషన్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ డేటా సైన్స్ స్వరూపాన్నే మార్చేశాయి" అని డేవిస్ అన్నారు.

డేటాను పరిశీలిస్తున్న మహిళ

డేటా సైంటిస్ట్ బాధ్యత ఎంత?

టెబ్లూ, క్లౌడేరా లాంటి వివిధ డేటా ఎనాలిసిస్ సంస్థలు ఇటువంటి ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు క్లిష్టమైన సమాచారాన్ని సరళమైన చార్టుల రూపంలోకి మారుస్తాయి. డేటా శాస్త్రవేత్తల కోసం కొన్ని ఐకాన్లను కూడా తయారు చేస్తాయి.

భారీ స్ప్రెడ్‌షీట్లలో ఉన్న సమాచారం నుంచి స్పష్టమైన సమాచారాన్ని వెలికి తీయడం ప్రతి ఒక్కరూ చేయలేరని ఈ విధానాన్ని చూస్తే తెలుస్తుంది.

ఈ కొత్త సాంకేతికత డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ చేసే పని మధ్య ఒక అస్పష్టతను నెలకొల్పింది.

డేటా అనలిస్ట్.. విశ్లేషణ చేసేందుకు కొంత సమయం వెచ్చించి నివేదికలు ఇవ్వవచ్చు. కానీ, డేటాను అర్థం చేసుకుని మార్పులు చేర్పులు చేసేందుకు మాత్రం డేటా సైంటిస్ట్ బాధ్యత వహిస్తారు.

మన ఉద్యోగాలు మెషీన్ల చుట్టూ తిరుగుతూ ఎప్పటికప్పుడు మారిపోతున్న తరుణంలో డేటాను అర్థం చేసుకోవడం మరింత భరోసాను ఇస్తుందని డేవిస్ భావిస్తున్నారు.

బలరాజ్ ఓట్స్

డేటా సైన్స్ బలరాజ్ ఓట్స్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది.

ఆమె ఒక హ్యాకథాన్ ద్వారా డేటా సైన్స్ గురించి తెలుసుకున్నారు. అందులో పాల్గొన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సమాచారాన్ని విశ్లేషించారు. దానిని ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో మహమ్మారి ప్రవర్తనలో ఉన్న వ్యత్యాసాలను తెలుసుకోగలిగారు.

అల్టీరిక్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆమె మరణాల రేటును చూపించే డేటా ఐకాన్‌లను డ్రాగ్ చేసి డ్రాప్ చేయగలిగారు.

కొన్ని వందల పేజీల లెక్కలను చూసే బదులు ఐకాన్లను మార్చడం ద్వారా ఆమె బృందంలో ఉన్న ఒక స్టాటిస్టిక్స్ నిపుణుడితో సమానమైన వేగంతో పని చేయగలిగారు.

కేలిక్యులేటర్‌తో పని చేయడానికి, డేటా సైన్స్ టూల్స్‌తో పని చేయడానికి మధ్యనున్న తేడాను ఆమె పోల్చి చూస్తారు.

తన ముగ్గురు పిల్లలకు 12సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె డేటా సైన్స్ రంగంలోకి అడుగుపెట్టారు.

విమెన్ రిటర్నర్స్ వెబ్‌సైటులో ఆమె హ్యాకథాన్ గురించి తెలుసుకున్నారు. కెరీర్‌లో కొన్ని రోజులు విరామం తీసుకున్న వారు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ఈ సైటు ఉపయోగపడుతుంది.

ఆమెకు డేటా సైన్స్‌లో ఉన్న అనుభవాన్ని ఆమె పిల్లల స్కూలులో కలిసిన మరొక వ్యక్తితో పంచుకున్నప్పుడు, డేటా డెవలప్మెంట్ స్పెషలిస్ట్ కోసం ఆమె వెతుకుతున్నట్లు తెలిసింది.

ఓట్స్ ప్రస్తుతం ఆమె కొత్తగా తెలుసుకున్న పరిజ్ఞానాన్ని ఆర్థిక సేవలను అందించే పరిశ్రమలో వినియోగిస్తున్నారు. ఆమె పిల్లలొకరు కోడింగ్ నేర్చుకుంటున్నారు.

"ఒక కెరీర్‌ను మలుచుకోవడానికి సమయం ఎప్పుడూ మించిపోదు. మీరూహిస్తున్నదాని కంటే కూడా ఇందులో ప్రవేశించడం మరింత సులభం" అని ఓట్స్ అన్నారు. అయితే, మిమ్మల్ని మీరెలా మార్కెట్ చేసుకుంటారనేది చాలా ముఖ్యం" అని ఆమె చెప్పారు.

"ఒక స్కూలు గేటు దగ్గర మాట్లాడుకున్న మాటలు నన్నీ ఉద్యోగంలో చేర్చాయి" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Data Scientist: Attractive jobs with arithmetic salaries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X