పెళ్లయిన కొన్ని నెలలకు.. భర్త మగాడు కాదని తెలిస్తే..

Subscribe to Oneindia Telugu

జకర్తా : డేటింగ్ చేసినన్ని రోజులు తెలియని రహస్యం.. పెళ్లయ్యాక కొన్నిరోజులకు గానీ బోధపడలేదు. ప్రియుడితో డేటింగ్ నచ్చడంతో పెళ్లికి ఓకె చెప్పిన ప్రేయసి అతడిని వివాహామాడింది. అయితే పెళ్లయ్యాక కూడా సదరు భర్త, ఆమెను దూరంగా పెడుతూ వస్తుండడంతో.. ఆమెలో అనుమానం మొదలైంది. చివరికి అదే అనుమానం నిజం కాగా.. నమ్మశక్యం కాని షాక్ తో నివ్వెరపోవడం ఆమె తనవంతయింది.

వివరాల్లోకి వెళితే.. హెనియాతీ(25) అనే ఇండోనేషియా యువతికి, ఈఫెండీ సపుత్రా (అసలు పేరు సువార్తీ) అనే యువకుడికి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ప్రేమికులుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో ఏడు నెలల తర్వాత జావా దీవుల్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Deceived bride discovered after months of sex man

అయితే భర్త ప్రతిరోజు ఏదో ఒక నెపంతో తనను దూరంగా పెడుతుండడంతో హెనియాతీలో అనుమానం మొదలైంది. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ యువతికి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. పోలీసు విచారణలో భాగంగా తేలిందంటే.. హెనియాతీ పెళ్లాడిన ఈఫెండీ సపుత్రా అసలు మగాడే కాదని తేలింది.

హెనియాతీ పెళ్లి చేసుకున్న సపుత్రా అసలు పేరు సువార్తీ అని, ఆమె ఓ స్త్రీ అని, 17 ఏళ్ల క్రితమే పెళ్లయిన ఆ 40 ఏళ్ల మహిళకు ఓ కొడుకు కూడా ఉన్నట్టుగా నిర్దారించారు పోలీసులు. దీంతో హెనియాతీ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ తగిలినట్టయింది. కాగా, మగాడిలా నటించి మోసగించినందుకు గాను సువార్తీకి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The brand new wedding couple Efendi Saputra (40) and Heniyati (25) in Boyolali in Central Java is on the rocks after Heniyati discovered that her husband Efendi actually a woman after a while. The local police investigating the case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X