సుప్రీంకోర్టు వద్దన్నందుకు ఇంకో 10 శాతం ఎక్స్ ట్రా టారిఫ్ పెంచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయాలను తీసుకున్నారు. ఏకంగా న్యాయవ్యవస్థతో పూర్తి స్థాయిలో పోరాటానికి దిగారు. గతంలో ఆయన విధించిన టారిఫ్ లను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అక్రమంగా తేల్చిన కొన్ని గంటల్లోనే ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. కొత్తగా 10 శాతం అదనపు టారిఫ్ ను విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో అప్పటికప్పుడు సంతకం కూడా చేసి పడేశారు.
దాదాపుగా తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయనీ తేల్చి చెప్పారు. కొత్తగా ప్రకటించిన 10 శాతం ఈ అదనపు టారిఫ్ అన్ని దేశాలకూ వర్తిస్తుంది. భారత్ సహా ఏ ఒక్క దేశం కూడా దీని నుంచి మినహాయింపు కాదు. దీన్ని గ్లోబల్ టారిఫ్ గా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోని అన్ని దేశాల దిగుమతుల పైనా దీన్ని వర్తింపజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశానని, ఇందుకు గర్వపడుతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ టారిఫ్ దాదాపు తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తుతానికి ఇది ప్రభావితం చేయబోదని పేర్కొన్నారు. అది న్యాయమైన ఒప్పందంగా అభివర్ణించారు. తాము భారత్ కు టారిఫ్ కట్టట్లేదని, అందుకే ఫ్లిప్ చేశామని పేర్కొన్నారు.
ఈ 10 శాతం అదనపు టారిఫ్ నుండి భారత్ కు మినహాయింపు ఇస్తూ కొత్తగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకూ టారిఫ్ భారం భారత్ పైనా పడుతుందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్ భారత్‌కు కూడా వర్తిస్తుందని, మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడేంత వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ప్రస్తుత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టారిఫ్ పై సుప్రీంకోర్టు తుది ఆదేశాలు వెలువడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తీర్పును తప్పుపట్టారు. భయంకరమైనది, లోపభూయిష్టమైనదిగా అభివర్ణించారు. కోర్టులోని కొందరు సభ్యుల పట్ల తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు.
అవసరమైతే టారిఫ్ పెంచుతామే తప్ప రద్దు చేయబోమనీ ప్రకటించారు. ఆ కొద్దిసేపటికే 10 శాతం అదనపు టారిఫ్ ను విధించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులపై సంతకం చేశారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు












Click it and Unblock the Notifications