తినడమే ఆమె 'ఉద్యోగం'!
నచ్చిన ఆహారం భుజిస్తూనే శరీర బరువును ఎలా అదుపులో పెట్టుకోవచ్చో నిరూపించడం కోసం బ్రిటన్ కు చెందిన 'వెయిట్ వాచర్స్' సంస్థ 'అఫిషియల్ ఈటింగ్ ఆఫీసర్'లను నియమించింది.
లండన్: 'మీకు నచ్చినవన్నీ తినండి.. అదే మీ ఉద్యోగం..' అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుంది? 'వారేవా.. అంతకన్నానా..' అంటూ ఎగిరి గంతేస్తారు ఎవరైనా. సరిగ్గా ఇలాంటి అవకాశమే బ్రిటన్ కు చెందిన సోఫీ హార్డీకి వచ్చింది. బ్రిటన్ కు చెందిన తొలి 'అఫిషియల్ ఈటింగ్ ఆఫీసర్'గా ఎంపికైన ఆమె తెగ ఆనందపడిపోతోంది. దేశవ్యాప్తంగా వందలాది అభ్యర్ధులు పోటీ పడిన ఈ ఉద్యోగం చివరికి పాతికేళ్ళ సోఫీని వరించింది.
ఇంతకీ ఈమె చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దేశవ్యాప్తంగా పర్యటించడం.. ప్రముఖ రెస్టారెంట్లలో వంటకాలను రుచి చూడడం.. కొన్ని స్మార్ట్ పరికరాల సాయంతో ఆయా ఆహార పదార్థాలలో ఎన్నెన్ని కేలరీలు ఉన్నాయో గుర్తించి 'వెయిట్ వాచర్స్' అనే సంస్థతో కలిసి వాటి ప్రమాణాలను నిర్ణయించడం.

సోఫీకి ఈ ఉద్యోగం ఇచ్చింది కూడా ఈ సంస్థే. ఎందుకిదంతా అంటే.. పోషకాహార నిబంధనల కారణంగా నలుగురితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఆరగించే భాగ్యానికి దూరమయ్యామని బ్రిటన్ లోని మూడొంతుల ప్రజలు అభిప్రాయ పడడం.
ముఖ్యంగా 25-30 ఏళ్ళ వయసు వారి నుంచి ఈ అభిప్రాయం అధికంగా వినిపిస్తోందట. దీంతో 'వెయిట్ వాచర్స్' సంస్థ నచ్చిన ఆహారం భుజిస్తూనే శరీర బరువును ఎలా అదుపులో పెట్టుకోవచ్చో నిరూపించడం కోసం ఇలా 'అఫిషియల్ ఈటింగ్ ఆఫీసర్'లను నియమించి వారితో కొన్ని ఆహార సూచనలు చెప్పించడం ప్రారంభించింది. మొత్తానికి భలే ఉద్యోగం కదూ? తిండికి తిండి.. జీతానికి జీతం. ఇదంతా చదివాక.. అబ్బ.. మన దేశంలో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఎంత బాగుంటుందో అనిపిస్తోంది కదూ?
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications