వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: సిబ్బందికి తెలియకుండా అదుపులోకి విమానం, టెక్కీ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: ఓ టెక్కీ ఏకంగా విమానంలోని వినోద వ్యవస్థను హ్యాక్ చేసి, కొద్దిసేపు ఓ పక్కకు ప్రయాణించేలా చేశాడు. ఈ షాకింగ్ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ విమానం.. సిబ్బంతికి తెలియకుండానే జరిగింది. ఈ సంఘటనకు కారణమైన టెక్కీని అరెస్టు చేశారు.

అగ్రరాజ్యంతోపాటు వివిధ దేశాల విమాన వ్యవస్థలో లోపాలను ఈ అమెరికన్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు ఎత్తిచూపాడు. ఏకంగా 15-20 సార్లు విమానాన్ని తనే కంట్రోల్‌ చేశానని చెప్పి విమానయాన సంస్థలను ఆత్మరక్షణలో పడేశాడు.

ఆ సాఫ్టువేర్ నిపుణుడి పేరు క్రిస్‌ రాబర్ట్‌. విమానం ఎక్కగానే అందులోని ఇన్‌ ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎఫ్ఈ) అదుపులోకి తీసుకునేవాడు. సీటు కిందుండే ఐఎఫ్ఈ వ్యవస్థను కేబుల్‌తో తన లాప్‌టాప్‌కు అనుసంధానం చేసి డీఫాల్ట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యేవాడు.

పైలట్‌, కో-పైలట్‌కు ఏమాత్రం అనుమానం రాకుండా కావాల్సినపుడు విమానాన్ని ఏటవాలుగా తిప్పేవాడు. ఈ మధ్య డెన్వెర్‌ నుంచి చికాగోకు వస్తున్నప్పుడు ఐఎఫ్ఈని ఆధీనంలోకి ఎలా తీసుకోవాలనే విషయాన్ని రాబర్ట్‌ ట్వీట్‌ చేశారు.

FBI: Hacker claimed to have taken over flight's engine controls

అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఎఫ్‌బీఐ విమానం దిగగానే రాబర్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాబర్ట్‌ చెప్పిన విషయాలు, ఎత్తిచూపిన లోపాలను చూసి ముక్కున వేలేసుకున్నారు. తన సీట్లో కూర్చునే కాక్‌పిట్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ను గమనించేవాడినని రాబర్ట్‌ విచారణలో చెప్పాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎఫ్‌బీఐ వద్ద క్రిస్ ఈ విషయాన్ని అంగీకరించాడు. బోయింగ్ 737, 757, ఎయిర్ బస్ ఏ 320 విమానాలపై హ్యాకింగ్ చేసినట్లు చెప్పాడు. విమానంలో సీటు కింద ఉండే ఎలక్ట్రానిక్ పెట్టే సాయంతో ఈ చర్యకు పాల్పడేవాడు.

ఏప్రిల్ 15న క్రిస్ డెన్వర్ నుండి రాబర్ట్స్ షికాగో వెళ్లారు. విమానంలో ఉండగానే అందులోని వినోద వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకు ఉన్న అవకకాశాన్ని గుర్తించి ట్వీట్ చేశాడు. రాబర్డ్స్ ఆ తర్వాత షికాగో నుండి సైరాక్యూజ్ వెళ్లాడు. అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
FBI: Hacker claimed to have taken over flight's engine controls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X