సహజీవనం చేస్తే జరిమానా.. బిడ్డ పుడితే ఫైన్! ఈ వింత గ్రామం రూల్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా గ్రామ అభివృద్ధి కోసం కమిటీలు కొన్ని నిబంధనలు పెడుతుంటాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ చిన్న గ్రామం వింతైన, కఠినమైన రూల్స్ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. చైనాలోని లింకాంగ్ అనే గ్రామంలో ఏకంగా ప్రజల వ్యక్తిగత జీవితాలపై ఆంక్షలు విధిస్తూ నోటీసు జారీ చేసింది. "గ్రామ నియమాలు: అందరూ సమానమే" పేరుతో వెలువడిన ఈ నిబంధనల జాబితా నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
జరిమానాల చిట్టా ఇదే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ గ్రామంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కింది విధంగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
*సహజీవనం: పెళ్లి చేసుకోకుండా కలిసి నివసించే జంటలకు ఏడాదికి 500 యువాన్లు (సుమారు రూ. 5,800) జరిమానా.

*ముందస్తు గర్భం: వివాహానికి ముందే గర్భిణీ అయితే 3,000 యువాన్లు (సుమారు రూ. 35,000) చెల్లించాలి.
*తొందరగా బిడ్డ పుడితే: పెళ్లయిన 10 నెలల లోపే బిడ్డ పుడితే, ఆ తల్లిదండ్రులు 3,000 యువాన్ల జరిమానా కట్టాలి.
*ఇతర రాష్ట్రం వాళ్లను పెళ్లి చేసుకుంటే: యునాన్ ప్రావిన్స్ కాకుండా ఇతర ప్రావిన్ల్ వాళ్లను పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా కట్టాల్సి ఉంటుంది.
*భార్యాభర్తలు గొడవలు పడితే: భార్యాభర్తలు గొడవపడి, ఆ సమస్య పరిష్కారానికి గ్రామ అధికారులను పిలిస్తే, ఒక్కొక్కరు 500 యువాన్లు చెల్లించాలి.
*వదంతులు వ్యాపింపజేస్తే: గ్రామంలో పుకార్లు పుట్టించినా లేదా తప్పుడు ఆరోపణలు చేసినా 500 నుండి 1,000 యువాన్ల వరకు జరిమానా విధిస్తారు.
ప్రభుత్వం స్పందన
ఈ వింత నిబంధనల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వం, ఈ నిబంధనలు "చాలా అసాధారణంగా" ఉన్నాయని అంగీకరించింది. గ్రామ కమిటీ స్వయంగా ఎవరి అనుమతి లేకుండా ఈ నోటీసును అతికించిందని, ప్రస్తుతం దానిని తొలగించామని అధికారులు వెల్లడించారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
ఈ చెట్లు మధ్యలో దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications