నైస్ దాడికి ముందే 2సార్లు రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది

Subscribe to Oneindia Telugu

ప్యారిస్: ఫ్రాన్స్‌లోని నీస్ ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాది మొహమ్మద్ లాహౌజ్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది.

నీస్ నగరంలో బాస్టల్ ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84మంది మృతికి కారణమైన మొహమ్మద్ లాహౌజ్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు.

France Attacker Visited Site With Truck Twice

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో మొహమ్మద్ లాహౌజ్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే ఆ తర్వాత కొంతకాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని తేల్చారు.

ఫ్రాన్స్ దాడి: స్త్రీ అరెస్ట్, 'అతనో తిరుగుబోతు, స్త్రీలోలుడు'

కాగా, ట్రక్‌తో దాడికి పాల్పడిన మొహమ్మద్ లాహౌజ్ మాజీ భార్య కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. పోలీసులు శుక్రవారం నాడు ఇద్దరిని, శనివారం నాడు ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tunisian attacker Mohamed Lahouaiej-Bouhlel visited the Nice promenade with his rented truck on two days before he rammed the vehicle into a crowd, killing 84, a source close to the investigation said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి