కరోనా థర్డ్‌వేవ్: లాక్‌డౌన్‌లోకి జారిపోయిన మరో దేశం: ఏప్రిల్ 18 వరకు కంప్లీట్‌గా
బెర్లిన్: మరో దేశం పూర్తిగా లాక్‌డౌన్‌లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్ విధించినట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్‌లను ప్రజల్లో ఇళ్లల్లోనే జరుపుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ఆరంభమైందని వెల్లడించారు.
Recommended Video
జర్మనీ వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు 107 శాతం మేర నమోదయ్యాయి., 68 వారాల తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు రికార్డ్ కావడం ఇదే తొలిసారి. 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చిందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఆయా రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారిని సంప్రదించిన తరువాతే కంప్లీట్ లాక్‌డౌన్ విధించామని తెలిపారు.

జర్మనీలో ఇప్పటిదాకా 26,78,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,418 మంది మరణించారు. 24,23,400 మంది రికవరీ అయ్యారు. 1,79,444 యాక్టివ్ కేసులు జర్మనీలో కొనసాగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల పెరుగుదల అనూహ్యంగా ఉంటోందని జర్మనీ రాబర్ట కోచ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. ప్రతి లక్ష మంది జనాభాకు 107 మంది వైరస్ బారిన పడుతున్నారని వెల్లడించింది. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. కొద్దిరోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించడమే దీనికి ప్రత్యామ్నాయమని సిఫారసు చేసింది.
దీనితో ఏప్రిల్ 18వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించినట్లు ఏంజెలా మెర్కెలో తెలిపారు. ఆ తరువాత కేసుల పెరుగుదలలో క్షీణత కనిపిస్తే.. లాక్‌డౌన్‌ను సడలిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జర్మనీలో అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్‌ను ప్రకటించారు. లాక్‌డౌన్‌ను విధించినందు వల్ల ఈస్టర్ హాలిడేస్‌ను ప్రజలు ఇళ్లల్లోనే గడపాలని ఛాన్సలర్ సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications