H-1B Lottery: హెచ్1బీ వీసాలకు లాటరీ రద్దు..! ఇకపై ఇలా-తాజా నోటిఫికేషన్..!
అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేస్తున్న హెచ్1బీ వీసాల ఎంపికకు వాడుతున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వీటి స్ధానంలో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇకపై దీని ఆధారంగానే వర్క్ వీసాలను జారీ చేయబోతున్నారు. దీంతో ఇప్పటివరకూ లాటరీ విధానంలో వీసాలు అందుకుంటున్న వారు ఈ మార్పులు గమనించాల్సి ఉంటుంది.
కొంతకాలంగా హెచ్1బీ వీసాల విధానంపై జరుగుతున్న చర్చకు చెక్ పెడుతూ ట్రంప్ సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. సుదీర్ఘకాలంగా విదేశీయులకు హెచ్1బీ వీసాల జారీకి వాడుతున్న లాటరీ విధానానికి ముగింపు పలికింది. నైపుణ్యం కలిగిన, అధిక జీతం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యతనిచ్చే కొత్త వెయిటెడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మార్పు తో భారతీయుల్లో ఎంట్రీ-లెవల్ నిపుణులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందడం చాలా కష్టంగా మారబోతోంది.

తక్కువ జీతంతో పనిచేయడానికి ఇష్టపడే విదేశీ కార్మికులకు అవకాశంగా మారిందనే విమర్శలున్న హెచ్1వీసా విధానాన్ని సమీక్షించిన ట్రంప్ సర్కార్.. వారిని కట్టడి చేసేందుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 ననుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ సీజన్‌తో ప్రారంభమయ్యే ఏటా సుమారు 85,000 హెచ్1బీ వీసాలకు చెక్ పెట్టబోతోంది.
హెచ్1బీ రిజిస్ట్రేషన్ల ప్రస్తుత ప్రక్రియను అమెరికాలో కంపెనీల యజమానులు దుర్వినియోగం చేశారని, అమెరికా కార్మికులకు చెల్లించే వేతనాల కంటే తక్కువ వేతనాలకు విదేశీ కార్మికుల్ని దిగుమతి చేసుకుంటున్నారని అమెరికా పౌరసత్వం, వలస విధాన సేవల ప్రతినిధి మ్యాథ్యూ ట్రాగెస్సర్ వెల్లడించారు. అందుకే ట్రంప్ సర్కార్ ఈ కొత్త విధానం అమల్లోకి తెస్తుందని ఆయన తెలిపారు. తాజా విధానం ప్రకారం హెచ్ 1బీ వీసాల అర్హత కోసం యజమానులు వీసాకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించక తప్పని పరిస్దితి ఎదురుకానుంది. ఇది ఎక్కువ నైపుణ్యం కలిగిన, అధిక జీతం పొందే విదేశీ కార్మికులకు హెచ్1బీ వీసాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తుంది.
-
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications