జపాన్‌లో వర్ష బీభత్సం, విరిగిన కొండచరియలు, 80 మంది గల్లంతు..
జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాటి కింద ప్రజలు కొందరు చిక్కుకున్నారు. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటామీలో కొండచరియలు సోమవారం విరిగిపడటంతో 80 మంది వరకు గల్లంతు అయ్యారు. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రహదారులపై వరదనీరు చేరి.. బురద బురద అయిపోయింది. ఇదీ సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.
కొండచరియలు విరిగిపడి శనివారం వరకు నలుగురు చనిపోయారు. 113 మంది కనిపించడం లేదని శనివారం చెప్పగా.. అదీ కాస్త పెరిగిందని అటామీ సిటీ అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు. సోమవారం ఇద్దరినీ కొండచరియల నుంచి వెలికితీశారు. కానీ వారు పేర్లను మాత్రం తెలియజేయలేదు. తన తల్లి ఆచూకీ ఇప్పటికీ కనిపించడం లేదని ఒకరు మీడియాకు తెలిపారు. ఇలా జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పారు.

అటామీలో 36 వేల మంది జనం నివసిస్తారు. టోక్యోకు నైరుతీ దిశలో 90 కిలోమీటర్ల దూరంలో సిటీ ఉంటుంది. జపాన్‌లో ప్రకృతి విపత్తులు కామనే.. కొండ చరియలు విరిగిపడటం.. భూకంపం, లావా బయటకు రావడం, సునామీ హెచ్చరికలు కూడా వస్తుంటాయి. ఈ నెలలో టోక్యోలో సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో కొద్దీ దూరంలో కొండచరియలు విరిగిపడటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నాటికి 1500 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.
సహాయ చర్యల్లో పోలీసులు, ఫైర్ ఫైటర్స్, మిలిటరీ నిమగ్నమైందని జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తెలిపారు. సహాయ చర్యలు కంటిన్యూ అవుతాయని పేర్కొన్నారు. ఇళ్లు కొట్టుకొని పోతున్న సమయంలో ఓ వృద్దుడు తప్పించుకోగలిగాడు. కానీ అక్కడే గల దంపతుల ఆచూకీ తెలియడం లేదు. అటామీలో 130 భవనాలపై కొండచరియలు ప్రభావం చూపించాయి.
At least two people were killed and 20 are still missing as rescue teams search for survivors after a deadly landslide in the town of Atami, Japan ⤵️ pic.twitter.com/o9b9Isp7yp
— Al Jazeera English (@AJEnglish) July 4, 2021
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications