అవును.. ఆ తప్పు చేశాను, క్షమించండి: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన తప్పును అంగీకరించారు. దానికి తాను క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను తన నివాసంలోని ప్రయివేటు ఈ మెయిల్ సర్వర్‌ను వినియోగించానని చెప్పారు.
అది తన తప్పేనని చెప్పారు. తన తప్పును అంగీకరిస్తున్నానని, దానికి క్షమాపణ చెబుతున్నానని హిల్లరీ క్లింటన్ అన్నారు. దానికి తనదే పూర్తి బాధ్యత అన్నారు. ఆమె ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై మాట్లాడారు.

వివాదాస్పద ఈ మెయిల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం పైన అప్పట్లో హిల్లరీ క్లింటన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ఘటన పైన క్షమాపణలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ప్రభుత్వం అనుమతి మేరకు ప్రయివేటు ఈ మెయిల్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి తరఫున బరిలో నిలిచేందుకు హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారు. తన పైన ఉన్న మచ్చను తొలగించుకునేందుకు ఆమె తప్పును అంగీకరించి, క్షమాపణలు చెప్పారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications