వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు, మోడీ ట్వీట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

1945 ఆగస్టు 6న ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఆరోజు జపాన్‌లోని హిరోషిమా నగరంపై ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అమెరికా అణుబాంబు ప్రయోగించి ఈరోజుకి 70 ఏళ్లు పూర్తయింది. ఆ తర్వాత మూడు రోజులకు రెండో అణుబాంబుని నాగసాకిపై ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు.

అమెరికా ప్రయోగించిన బాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రజలు మరణించగా 90 శాతం నగరం పూర్తిగా ధ్వంసమైంది. దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే 70వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ప్రయోగించిన ఆ భయంకర విస్ఫోటనాన్ని తట్టుకొని జన్‌బకూ డోమ్ అనే ఒకేఒక్క భవనం మాత్రమే పాక్షికంగా మిగిలింది.

అణుబాంబు దాడి ఘటనలో చనిపోయిన వేలాదిమందికి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు తెలిపారు. "హిరోషిమా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందిరికీ నా శ్రద్ధాంజలి. నాటి బాంబు ఘటన అలాంటి యుద్ధాల వల్ల సంభవించే భయంకర దృశ్యాలను, మానవత్వంపై పడే ప్రభావాన్ని మనందరికీ గుర్తుకు తెస్తుంది" అని ప్రధాని ట్వీట్ చేశారు.

 మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

70 ఏళ్ల క్రితం అలా పాక్షికంగా నిలిచిన భవనమే ఈరోజు హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది. జపాన్‌లో ఉన్న చారిత్రక నగరాల్లో హిరోషిమా ఒకటి. ఈ నగరం జపాన్‌లోని అతి పెద్ద ద్వీపం అయిన హోంషూలో ఉంది.

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

హిరోషిమా నగరాన్ని 1589లో మోరి టెరిమోటో నిర్మించారు. పటిష్టమైన ఆర్థిక, సైనిక వ్యవస్థలతో ఈ నగరం అందరినీ ఆకర్షించేది. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా అణుబాంబు దాడికి గురైన నగరం ఇది.

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యం ప్రధాన స్థావరం హిరోషిమా నగరమే. సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే అనేక ఆయుధ డిపోలు ఆ నగరంలో ఉండేవి. అందుకే హిరోషిమాను తుడిచి పెట్టేయాలని అమెరికా భావించి హిరోషిమాపై అణుబాంబు ప్రయోగించింది.

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

అణుబాంబు దాడికి హిరోషిమాలోని భవనాలు సుమారు 69 శాతం నేలమట్టం అయ్యాయి. 1942 నాటికి హిరోషిమా జనాభా నాలుగు లక్షల 20 వేలు. అణుబాంబు దాడి జరిగిన తర్వాత జనాభా సంఖ్య లక్షా 38 వేలకు పడిపోయింది.

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు

అంటే రెండు లక్షల 80 వేలకు పడిపోయింది. 1955 నాటికి పూర్తిగా కోలుకున్న ఈ నగరం అంచలంచెలుగా అభివృద్ధి చెందింది. జపాన్ చరిత్రనే మార్చివేసిన ఈ సంఘటనకు గుర్తుగా హిరోషిమా నగరంలో పీస్ మెమోరియల్ పార్కుని నిర్మించారు. ప్రతి ఏడాది ఆగస్టు 6న అక్కడకు పెద్దఎత్తున ప్రజలు చేరుకుని నివాళులర్పిస్తుంటారు.

English summary
A ceremony, attended by PM Shinzo Abe, was held at Hiroshima's memorial park before thousands of lanterns are released on the city's Motoyasu river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X