• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏలియన్స్‌తో జాగ్రత్త, స్పందించొద్దు: స్టీఫెన్ హాకింగ్ వార్నింగ్

|

లండ‌న్‌: ప్ర‌ముఖ బ్రిటీష్ భౌతిక శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ మరోసారి గ్రహాంతర వాసుల(ఏలియన్స్) అంశంపై స్పందించారు. గ‌్ర‌హాంత‌ర‌వాసుల సందేశానికి స్పందించ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయన హెచ్చ‌రించారు. ఏలియన్స్.. మ‌నుషుల కంటే ఎంతో అత్యాధునిక టెక్నాల‌జీ క‌లిగి ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

మ‌న‌కంటే ఎంతో ముందున్న నాగ‌రిక‌త‌తో మ‌న ప‌రిచ‌యం ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని హాకింగ్ స్ప‌ష్టంచేశారు. స్థానిక అమెరిక‌న్లు తొలిసారి కొలంబ‌స్‌ను చూసిన త‌ర్వాత ఏమైందో ఇదీ అలాంటిదేన‌ని ఆయ‌న అన్నారు. హాకింగ్ త‌న కొత్త ఆన్‌లైన్ ఫిల్మ్ స్టీఫెన్ హాకింగ్స్ ఫేవ‌రెట్ ప్లేసెస్‌లో ఈ హెచ్చరిక చేశారు.

ఈ ఫిల్మ్ వీక్ష‌కుల‌కు విశ్వంలోని ఐదు కొత్త ప్ర‌దేశాల‌ను ప‌రిచ‌యం చేయ‌నుంది. ఎస్ఎస్ హాకింగ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఆయ‌న ఫేవ‌రెట్ ప్లేసెస్‌ను వీక్ష‌కులు చూడ‌వ‌చ్చు. ఈ ఆన్‌లైన్ ఫిల్మ్ ద్వారానే హాకింగ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మ‌న‌కు 16 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో అచ్చూ భూమిలాంటి గ్ర‌హంగా ఉన్న‌ గ్లీజ్ 832సీని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాకింగ్ గ్ర‌హాంత‌ర‌వాసుల‌తో వ‌చ్చే ప్ర‌మాదాన్ని వివ‌రించారు.

If aliens call, do not answer, warns Stephen Hawking

'గ్లీజ్ 832సీలాంటి గ్ర‌హం నుంచి ఏదో ఒక రోజు మ‌న సిగ్న‌ల్ అందుకోవ‌చ్చు. అయితే దీనికి స్పందించ‌డం మాత్రం ప్ర‌మాద‌మే. వాళ్లు మ‌న‌క‌న్నా చాలా శ‌క్తిమంతులు కావ‌చ్చు. మ‌నం బ్యాక్టీరియాను ఎలా చూస్తామో.. మ‌న‌ల్ని వాళ్లు అలాగే చూసే ప్ర‌మాదం ఉంది' అని స్టీఫెన్ హాకింగ్ హెచ్చ‌రించారు. విశ్వంలో మ‌నం ఒంట‌రివాళ్లం కాద‌ని, ఎక్క‌డో ఓ చోట జీవం ఉంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు మ‌రింత ఎక్కువైందని ఆయ‌న చెప్పారు.

ఏలియ‌న్స్ గురించి హాకింగ్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌త సంవత్సరం మ‌న‌కు స‌మీపంలోని ప‌ది ల‌క్ష‌ల న‌క్ష‌త్రాల‌పై జీవం అన్వేష‌ణ కోసం ఉద్దేశించిన‌ బ్రేక్‌థ్రూ లిసెన్ ప్రాజెక్ట్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కూడా హాకింగ్ ఇలాగే హెచ్చ‌రించారు. మ‌న సందేశాల‌ను స్వీక‌రించే గ్ర‌హాంత‌ర‌వాసులు మ‌న‌కంటే కొన్ని వంద‌ల కోట్ల ఏళ్ల ముందే ఉండొచ్చ‌ని ఆయ‌న అన్నారు.

ఇది ఇలా ఉండగా, ఏలియ‌న్స్ (గ్ర‌హాంత‌ర‌వాసులు) కోసం అన్వేష‌ణ మొద‌లైంది. నైరుతి చైనాలోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఆదివారం త‌న ప‌ని ప్రారంభించింది. 30 ఫుట్‌బాల్ మైదానాలంత‌ వైశాల్యంలో ఉన్న అపెర్చ‌ర్ స్పెరిక‌ల్ రేడియో టెలిస్కోప్ (ఎఫ్ఎఎస్‌టీ)ను గిజౌలోని కొండ ప్రాంతంలో ఏర్పాటుచేశారు. రూ.1200 కోట్ల ఖ‌ర్చుతో ఏర్పాటైన ఈ టెలిస్కోప్ ఆదివారం మ‌ధ్యాహ్నం ప‌నిచేయ‌డం ప్రారంభించిన‌ట్లు జినువా న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది.

English summary
Hawking has issued a warning not to answer calls from aliens. But Hawking has been issuing such warnings for a long time. He has said it before and he will say it again: If extraterrestrials call, do not answer, at least not without careful consideration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X