Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ కు మోడీ ఊహించని ఝలక్..! సుంకాల చర్చలపై కీలక నిర్ణయం..!

రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోళ్లు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నామన్న కారణం చూపుతూ భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్ కు ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భారత్ ను టార్గెట్ చేసేందుకు ఉన్న అవకాశాల్ని వాడుకుంటున్న ట్రంప్ వలసదారులు, విద్యార్ధులు, వీసాలు ఇలా ప్రతీ అంశంలోనూ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే భారత్ మాత్రం ట్రంప్ కు లొంగేది లేదని తేల్చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరో ఝలక్ ఇచ్చింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్.. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే భారీగా సుంకాలు విధిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పుకున్నారు. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ నేరుగా మాట్లాడటం వల్లే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు క్లారిటీ ఇచ్చేసింది. అయినా ట్రంప్ మాత్రం ఇంకా తన పాత రికార్డునే పదే పదే వల్లెవేస్తున్నారు. దీంతో పాటు రష్యా చమురు పేరు చెప్పి భారత్ పై 50 శాతం సుంకాల మోత మోగించిన ట్రంప్ తో తొలుత చర్చలు జరిపిన భారత్ ఆ తర్వాత క్రమంగా వెనక్కి తగ్గుతోంది.

India s Strong Economy Gives Leverage in US Tariff Talks Ready to Wait for Favorable Deal

భారత్ పై విధించిన 50 శాతం సుంకాలు తగ్గించాలంటే రష్యా చమురు కొనుగోళ్లు ఆపాలంటూ ట్రంప్ గతంలో పలుమార్లు సూచించారు. అయితే రష్యా చమురు కొనుగోళ్లు కాస్త తగ్గించుకున్న భారత్.. ఆ మేరకు సుంకాలు తగ్గించాలన్న డిమాండ్ తో జరుపుతున్న చర్చల విషయంలో మాత్రం పట్టుదలనే ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా భారత్-అమెరికా ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గరాదని తాజాగా నిర్ణయించింది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

India s Strong Economy Gives Leverage in US Tariff Talks Ready to Wait for Favorable Deal

ఇందులో భారత ఆర్ధిక వ్యవస్థ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల్ని తట్టుకుని నిలబడింది. అదే సమయంలో ఎగుమతులపై పడిన ప్రభావాన్ని తట్టుకునేందుకు స్వదేశీ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచారు. దీంతో పాటు ఇతర దేశాల మార్కెట్లపై ఫోకస్ పెట్టారు. ఇవన్నీ కలిసొచ్చి ఇప్పుడు ట్రంప్ సుంకాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో జరిగే వాణిజ్య చర్చల్లో పైచేయి సాధించింది. అలాగే ఈ చర్చల్లో వెంటనే ఫలితం తేలాలని కూడా కోరుకోవడం లేదట. కాస్త వేచి చూసే ధోరణితో ఉంటేనే ట్రంప్ దారికి వస్తాడనే ఆలోచన కేంద్రంలో కనిపిస్తోంది. దీంతో సుంకాల పేరు చెప్పి సాధ్యమైనంత త్వరగా భారత్ ను దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ కల నెరవేరేలా కనిపించడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+