షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయి ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఇరాన్ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం హార్మూజ్ జలసంధిని మూసివేసింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న F-15 ఫైటర్ జెట్ ను తమ బలగాలు పేల్చేసినట్లు ఇరాన్ నుంచి ప్రకటన రిలీజ్ అయింది. అలాగే టెహ్రాన్ టైమ్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో నిడివి 29 సెకన్లు ఉంది. ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన తరుణంలో ఇరాన్ ఇలాంటి చర్యకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
#BREAKING
— Tehran Times (@TehranTimes79) March 22, 2026
An enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast. pic.twitter.com/jmrFuUQKbd
మరోవైపు ఫోర్త్ జనరేషన్ F-15 ఫైటర్ జెట్ అమెరికాకు చెందినదా..? లేదా ఇజ్రాయెల్ కు చెందినదా..? అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘటనపై అటు అమెరికా నుంచి గానీ ఇటు ఇజ్రాయెల్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెల్లడికాకపోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అంతకుముందు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ట్రంప్ వార్నింగ్ అనంతరం ఇదే విషయంపై ఇరాన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ హార్మూజ్ జలసంధి కేవలం ఇరాన్ శత్రు దేశాలకే మూసి ఉంటుందని స్పష్టం చేశారు. మేరిటైమ్ కార్యకలాపాలు మరింత సులభంగా కొనసాగేందుకు ప్రపంచ దేశాలు, సంస్థలకు ఇరాన్ సహకరిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ పేల్చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ పేల్చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
-
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications