అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక..
పర్షియన్ గల్ఫ్ వేదికగా అమెరికా గనుక భూతల దాడులకు (Ground Operations) దిగితే, ఆ దేశ సైనికులు సముద్రంలోని "షార్క్ చేపలకు ఆహారంగా" మారుతారని ఇరాన్ అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించింది. ఇరాన్ సాయుధ దళాలకు చెందిన 'ఖతం అల్-అన్బియా' సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జొల్ఫకరి మార్చి 29, 2026న విడుదల చేసిన వీడియో ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అమెరికా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ధీటుగా బదులిచ్చేందుకు తమ సైన్యం "క్షణాలను లెక్కిస్తోందని" జొల్ఫకరి స్పష్టం చేశారు. "ఇస్లాం యోధులు అటువంటి చర్యల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆక్రమణదారులు అవమానకరమైన ఓటమిని చవిచూడక తప్పదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమెరికా కమాండర్లు, సైనికులు పర్షియన్ గల్ఫ్ షార్క్‌లకు మంచి విందు భోజనం అవుతారు" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ అబద్దాలకోరు..
ఈ సందర్భంగా జొల్ఫకరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ట్రంప్‌ను ప్రపంచంలోనే "అత్యంత అబద్ధాలకోరు అధ్యక్షుడు" అని అభివర్ణించారు. "ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారు, మరుసటి గంటలోనే యుద్ధం అంటారు. ఆయన నిర్ణయాల్లో స్థిరత్వం లేదు" అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జెఫ్రీ ఎప్స్టీన్ కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో ఉన్న సంబంధాల కారణంగా ట్రంప్ ఇజ్రాయెల్ నిఘా సంస్థ 'మొస్సాద్' ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఇజ్రాయెల్ ప్రధానికి ఆయన ఒక "పావు"గా మారారని జొల్ఫకరి ఆరోపించారు.
Iranian Army Spokesperson Brigadier General Ebrahim Zolfaghari –
— Commentary Iran Tracker (@24_70xu) March 24, 2026
We are not only fighting for our country, but also for the oppressed Islamic Ummah and the Palestinian people pic.twitter.com/sn0sRfus2w
Iran బిగుస్తున్న ఉచ్చు.. పెంటగాన్ వ్యూహాలు!
మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో భూతల కార్యకలాపాల కోసం అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) రహస్య ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న వార్తలు ఇరాన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. వ్యూహాత్మకమైన ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ దాడులకు ఇంకా అధికారిక ఆమోదం లభించనప్పటికీ, ఇరాన్ మాత్రం తన రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకుంటోంది.
30 రోజుల యుద్ధం.. క్లిష్ట దశలో పరిస్థితి
సంఘర్షణ ప్రారంభమై నెల రోజులు గడిచిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "అమెరికా బహిరంగంగా చర్చల గురించి మాట్లాడుతున్నప్పటికీ, తెరవెనుక సైనిక కార్యకలాపాలను పెంచడానికి కుట్రలు చేస్తోంది. కానీ మా క్షేపణులు, మా వీధులు, మా జలసంధులు ప్రత్యర్థుల మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయి" అని ఆయన ప్రకటించారు.
ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం క్షిపణి దాడుల కంటే వేగంగా సాగుతుండటంతో, పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లను, అంతర్జాతీయ స్థిరత్వాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు












Click it and Unblock the Notifications