వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్: కోవిడ్ వార్డులో అగ్నిప్రమాదంతో 50మందికి పైగా మృతి - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంటలు ఆర్పుతున్న సిబ్బంది

ఇరాక్‌లోని నసిరియా నగరంలోని ఓ కోవిడ్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో అగ్నిప్రమాదం జరగడంతో 50 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి కారణాలు అధికారికంగా తెలియరాలేదు.

కానీ ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

బాధితుల కుటుంబ సభ్యులు న్యాయం కోరుతూ ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు.

ఆసుపత్రి యజమానిని అరెస్ట్ చేయాల్సిందిగా ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ ఖదెమి ఆదేశించారు.

ప్రమాదం జరిగిన ఆసుపత్రి

ప్రమాదం జరిగిన కోవిడ్ వార్డును 70 బెడ్ల సామర్థ్యంతో 3 నెలల కిందటే నిర్మించినట్లు అసోసియేట్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీకి ఇరాక్ వైద్యాధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో 63మంది రోగులు వార్డులో ఉన్నట్లు అక్కడి ప్రాంతీయ ఆరోగ్య అధికారి తెలిపారు.

'కరోనా వార్డు లోపల పెద్ద పేలుడు శబ్ధాన్ని నేను విన్నాను. ఆ వెంటనే మంటలు చెలరేగాయి' అని ఆసుపత్రి గార్డు తెలిపినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

'ఇరాక్ ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. ఇలాంటి వైఫల్యాలకు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయం' అని ఇరాక్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ అల్ హల్బసీ ట్వీట్ చేశారు.

దేశ రాజధాని బాగ్దాద్‌లో ఏప్రిల్ నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలడంతో మంటలు చెలరేగి 82 మంది కన్నుమూశారు.

ఈ ఘటన తర్వాత ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీ పదవికి రాజీనామా చేశారు.

ఏళ్ల తరబడి యుద్ధాలు, నిర్లక్ష్యం, అవినీతితో సతమతమవుతోన్న ఇరాక్‌ హెల్త్ సర్వీస్‌ను కరోనా మహమ్మారి మరింత కుంగదీసింది.

జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం ఇరాక్‌లో ఇప్పటివరకు 14లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 17,000 మంది వైరస్‌కు బలయ్యారు.

దాదాపు 4కోట్ల జనాభా ఉన్న ఇరాక్ ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ప్రజానీకానికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iraq: More than 50 killed in covid ward fire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X