వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదికి కోటి: లిజ్ ట్రస్ భత్యం ఇదీ, మాజీ ప్రధానులకు, హోదా

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ ప్రధాని పదవీకి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పదవీ నుంచి తొలగిపోతున్న ప్రయోజనం పొందనుంది. అంటే పదవీ లేదనే బాధ ఉండనుంది. కానీ ఆర్థికపర ప్రయోజనం మాత్రం దక్కనుంది. అదీ కూడా మాజీ ప్రధాని హోదాలో లభించనుంది. ఏడాదికి కోటి వరకు ఆమెకు భత్యం లభించనుంది.

ప్రజామోదం లేని ఆర్థిక విధానాలతో తీవ్ర వ్యతిరేకతను లిజ్ ట్రస్ మూటగట్టుకున్నారు. దాంతో ప్రధాని పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. పదవీ విరమణ అనంతర భృతి మాత్రం వావ్ అనిపించేలా ఉంది. మాజీ ప్రధాని హోదాలో ఏడాదికి 1.06 కోట్ల భత్యం లభించనుంది. లైఫ్ టైం లిజ్ ట్రస్ ఈ భృతి అందుకోనున్నారు. ప్రజా సంబంధ విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఈ చెల్లింపులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. నిధులను రీయింబర్స్ మెంట్ విధానంలో చెల్లిస్తారు.

Liz Truss benefit every year crore

1990లో ప్రధాని పదవీ నుంచి మార్గరెట్ థాచర్ రాజీనామా చేశారు. ఆ తర్వాతే ఈ భత్యం ఏర్పాటు చేశారు. 1991లో అప్పటి ప్రధాని జాన్ మేజర్ ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ స్కీం ద్వారా ఏటా కోటికు పైగా భత్యం పొందుతున్నారు. ఒకసారి ప్రధానిగా పనిచేస్తే, ప్రజల్లో వారికి ప్రత్యేకస్థానం ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి కార్యక్రమాల ఖర్చుల కోసమే ఈ భృతి అని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

లిజ్ ట్రస్ కు ఈ వార్షిక భృతి మాత్రమే కాదు, పార్లమెంట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ నుంచి వ్యక్తిగత పెన్షన్ కూడా లభిస్తుంది. ఆమె పదవీ నుంచి దిగిపోయే నాటికి ఎంత వార్షిక వేతనం అందుకునేవారో, అందులో సగం పెన్షన్ గా అందిస్తారు. సో లిజ్ ట్రస్ పదవీ కోల్పోయిన భత్యం మాత్రం భారీగానే అందుకోనుంది.

English summary
Liz Truss benefit every year crore money sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X