ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ టాప్ కమాండర్ హతం
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్‌ల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశ టాప్ కమాండర్ మహమ్మద్ పక్ పూర్ హతం అయినట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ.. వీరితోపాటు ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ దాడుల్లో మృతి చెందలేదని ఇరాన్ వెల్లడించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇజ్రాయెల్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ పక్ పూర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. పక్ పూర్ గతనెలోనే ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ , అమెరికా నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురైనా తక్షణం స్పందించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉంటుందని.. గన్ ట్రిగ్గర్ పై వేలు ఎప్పుడూ ఉంటుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఇక మహమ్మద్ పక్ పూర్ గతంలో IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ గా విధులు నిర్వర్తించారు. అయితే 2025లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి కమాండర్ హొస్సేన్ సలామీ హతం అయిన నేపథ్యంలో పక్ పూర్ ను IRGC కొత్త చీఫ్ గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నియమించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ కమాండర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.

మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్ లోని బాలికల పాఠశాల పూర్తిగా దగ్ధం అయినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడిలో దాదాపు 30 మందికి పైగా చిన్నారులు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తాజాగా వెల్లడించింది. అలాగే యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయన్, ఖతార్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications