
మంకీపాక్స్ మహమ్మరి: అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితి: డబ్ల్యుహెచ్‌వో ప్రకటన
మంకీపాక్స్ కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశంలో కూడా 3 కేసులు నమోదయ్యాయి. అవీ కేరళలోనే రావడం విశేషం. ఇతర దేశాల్లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని విధించింది. కరోనా మాదిరిగా ఇదీ కూడా మహమ్మరియేనని.. సీరియస్ నెస్ దృష్ట్యా డిక్లేర్ చేసింది. మంకీపాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. దీంతో నిపుణులు దాని తీవ్రత గురించి డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానమ్‌కు సిఫారసు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 14 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఐదుగురు చనిపోయారు. అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లోనూ మంకీపాక్స్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నమోదైన కేసుల్లో 99 శాతం కేసుల్లో గే లేదా బైసెక్సువల్ వ్యక్తులే ఉన్నారు. ఇండియాలో ఇప్పటివరకు 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 3 కేసులు కేరళలో నమోదవడం గమనార్హం. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో విమానాశ్రయాల్లో విస్తృతంగా స్క్రీనింగ్ చేపడుతున్నారు.
మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ఇంగ్లాండ్ పరిశోధకుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చునని పేర్కొంది. 16 దేశాల్లో 528 మంకీపాక్స్ కేసులను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. దీనిపై జూలై 21న '16 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్-ఏప్రిల్-జూన్ 2022' పేరుతో ఇంగ్లాండ్‌లో ఒక జర్నల్ ప్రచురితమైంది.