వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ప్రాబ్లం.. హెచ్ 1 బీ వీసాకు ఆప్షన్లు ఉన్నాయి: ఎల్1, ఈబీ5 వీసాలు బెటర్ రూట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హెచ్ - 1 బీ వీసాల జారీపై పరిమితులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు చట్టంగా మారితే భారతీయ ఐటీ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చే ఏడాది 2018లో హెచ్ 1 బీ వీసా జారీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన పరిమితులు అమలులోకి రానున్నాయి.

అదే విధంగా సదరు సంస్థల క్లయింట్లు భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో సేవలందిస్తున్న ఐటీ కంపెనీలు.. ప్రత్యేకించి భారతీయ ఐటీ సంస్థలు.. హెచ్ 1 బీ వీసా కింద భారీగా లబ్దిపొందాయి. కానీ దానిపై పరిమితులు విధించడంతో ప్రత్యామ్నాయంగా 'ఎల్ 1' వీసాలను విదేశీ వర్కర్ బదిలీకి ఉపయోగించుకోవచ్చునన్నది ఇమ్మిగ్రేషన్ నిపుణుల మాట.

దానికి బదులు 'ఇబీ 5' దరఖాస్తుల దారుల కోసం సదరు టెక్నాలజీ సంస్థలు రెండు విధాలుగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు. టార్గెటెడ్ ఎంప్లాయ్ మెంట్ ఏరియా (టీఈఏ) కింద 5 లక్షల డాలర్లు, నాన్ టీఈఏ కింద 10 లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. 'ఈబీ5', 'ఎల్1ఏ' వీసా పొందిన వారు సహజంగానే అమెరికాలో శాశ్వత నివాసంతోపాటు పౌరసత్వం వేగంగా పొందేందుకు వీలు చిక్కుతుందని పేర్కొంటున్నారు.

వచ్చే ఏడాది నుంచి ట్రంప్ ఆదేశాలు అమలు

వచ్చే ఏడాది నుంచి ట్రంప్ ఆదేశాలు అమలు

2018 నుంచి హెచ్ 1 బీ వీసాల జారీపై పరిమితులు అమలులోకి వస్తాయి కానీ ఇమ్మిగ్రేషన్ నిపుణులు మాత్రం దానివల్ల ప్రతికూల ప్రభావమేమీ ఉండదని అంటున్నారు. హెచ్ 1 బీ వీసా పొందిన వారిలో అత్యధికులు భారతీయులే కనుక ఎల్ 1, ఈబీ 5 వీసాలను తమ ప్రత్యామ్నాయాలుగా వాడుకోవచ్చునని సూచిస్తున్నారు. వివిధ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు 2018 ఏప్రిల్ మూడో తేదీ నుంచి హెచ్ 1 బీ వీసా కోసం ఐటీ నిపుణుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఈ ఏడాది నిర్దేశిత కాలంలో హెచ్ 1 బీ వీసా కోసం నిర్దేశిత కాలంలో 1,99,000 దరఖాస్తులు వచ్చాయని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) చెప్తున్నది. ఏప్రిల్ 11వ తేదీన ‘యూఎస్‌సీఐఎస్' కంప్యూటర్ ద్వారా లాటరీ తీసిన దరఖాస్తులు తీసి 65 వేలు జనరల్ కేటగిరీలోనూ, అమెరికా డిగ్రీ సర్టిఫికెట్లతో 20 వేల దరఖాస్తులను ఎంపిక చేసి హెచ్ 1 బీ వీసాలు జారీకి సిఫారసు చేస్తుంది.

ఎల్ 1, ఈబీ5 వీసాలు సరైన ప్రత్యామ్నాయం

ఎల్ 1, ఈబీ5 వీసాలు సరైన ప్రత్యామ్నాయం

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ 1 బీ వీసాలు జారీ ప్రక్రియను కఠినతరం చేస్తున్నది. హెచ్ 1 బీ వీసా పొందాలని భావించే కంప్యూటర్ ప్రోగ్రామర్లు తమ వ్రుత్తిలో మరింత ప్రత్యేకత గలవారిమని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం కంప్యూటర్ డిగ్రీ సర్టిఫికెట్ మాత్రమే సరిపోదని యూఎస్‌సీఐఎస్ స్పష్టతను ఇచ్చింది. అమెరికా డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు జాయ్ లాఫ్‌గ్రీన్ ప్రవేశ పెట్టిన బిల్లు చట్టరూపం సంతరించుకుంటే హెచ్ 1 బీ వీసా పొందిన వ్యక్తి వేతనాన్ని ఏడాదికి 60 వేల డాలర్ల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంచాల్సి ఉంటుంది.

స్థానికుల్లో ప్రతిభ వెలికితీయడమే ప్రత్యామ్నాయం

స్థానికుల్లో ప్రతిభ వెలికితీయడమే ప్రత్యామ్నాయం

హెచ్ 1 బీ వీసా పొందిన ఉద్యోగికి వేతనం చెల్లించాల్సి వస్తే అదే జరిగితే ఐటీ కంపెనీల లాభాలు తగ్గుముఖం పడతాయని డేవీస్ అండ్ అసోసియేట్స్ గ్లోబల్ చైర్మన్ మార్క్ డేవిస్ చెప్పారు. డేవిస్ అసోసియేట్స్ వాయవ్య ఆసియా, భారత్ ఫార్టనర్ అండ్ ప్రాక్టీస్ చైర్ అభినవ్ లోహియా మాట్లాడుతూ అమెరికలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు అదే దేశంలో ప్రతిభావంతులను వెలికి తీయాల్సి ఉంటుందని, లేదంటే ఎల్ 1 బీ, ఎల్ 1 ఏ వీసాలను ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎల్ 1 వీసాలతో ఇలా

ఎల్ 1 వీసాలతో ఇలా

అమెరికాలోని ఒకే సంస్థలో ప్రత్యేక క్యాటగిరీలో పనిచేస్తున్న విదేశీ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ అదే స్థానంలో కొనసాగించేందుకు ఎల్ 1 వీసాలు తాత్కాలిక బదిలీగా ఉపకరిస్తాయి. అమెరికాలో సేవలు అందిస్తున్న పలు సంస్థలు స్థానిక కంపెనీలు, ఆ దేశంలో పునాది గల విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతాయని డేవిస్ అసోసియేట్స్ వాయవ్య ఆసియా, భారత్ ఫార్టనర్ అండ్ ప్రాక్టీస్ చైర్ అభినవ్ లోహియా చెప్పారు. అమెరికా కంపెనీలు, క్లయింట్లు వివాదాల పరిష్కారానికి తమ దేశంలోని కోర్టులకే ప్రాధాన్యం ఇస్తుంటారు.

ఈబీ 5 వీసాలతో ఇవీ ప్రయోజనాలు

ఈబీ 5 వీసాలతో ఇవీ ప్రయోజనాలు

హెచ్ 1 బీ వీసా, ఎల్ 1 వీసాలతో పోలిస్తే ఈబీ 5 వీసా ఎంచుకునేవారు ముందే తమ సంపాదన చాలని భావిస్తే సరి. ఏం చక్కా ఈబీ 5 వీసా కోసం అప్లయి చేసేయవచ్చు. అయితే ఈబీ 5 వీసా దరఖాస్తు దారు టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ)లో ఉద్యోగం కోసం 5 లక్షల డాలర్లు, నాన్ టీఈఏలో ఉద్యోగానికి 10 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పది జాబుల కోసం పెట్టుబడి పెట్టొచ్చు కూడా. ఈబీ 5 వీసాలు పొందుతున్న వారు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈబీ 5 వీసాలు పొందిన వారు అమెరికా నుంచి మెరుగైన జీవనం పొందొచ్చు. మరిన్ని అవకాశాలు పొందొచ్చు. వ్యాపార లావాదేవీలను విస్తరించొచ్చు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగం పొందాలంటే ప్రస్తుతం ఈబీ5 వీసాలే పరిష్కార మార్గం అని డేవిస్ అసోసియేట్స్ వాయవ్య ఆసియా, భారత్ ఫార్టనర్ అండ్ ప్రాక్టీస్ చైర్ అభినవ్ లోహియా చెప్పారు.

గ్రీన్ కార్డు పొందేందుకూ దగ్గర దారి ఎల్ 1, ఈబీ 5

గ్రీన్ కార్డు పొందేందుకూ దగ్గర దారి ఎల్ 1, ఈబీ 5

అమెరికా పౌరసత్వం వేగంగా పొందేందుకు ఈబీ 5, ఎల్ 1 వీసా దారి తీస్తాయని డేవిస్ అసోసియేట్స్ వాయవ్య ఆసియా, భారత్ ఫార్టనర్ అండ్ ప్రాక్టీస్ చైర్ అభినవ్ లోహియా చెప్పారు. ఇదొక్కటే అమెరికాలో ఉద్యోగం పొందేందుకు మార్గం అని తెలిపారు. హెచ్ 1 బీ వీసా పొందిన వ్యక్తి ఉద్యోగం కోల్పోతే తన కుటుంబంతోపాటు అమెరికాను వీడాల్సి ఉంటుంది. కానీ ఎల్1, ఈబీ5 వీసా పొందిన వారు దీర్ఘ కాలం అమెరికాలో నివాసం ఉండటంతోపాటు సరైన సమయంలో గ్రీన్ కార్డు జారీ చేసేందుకు వీలవుతుందన్నారు.

English summary
The bill, if passed, will impact the margins of IT companies, the biggest beneficiaries of the H1-B visa programme, or their clients will face higher charges for the work performed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X