వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభినందన్ ను అప్పగించడానికి సిద్ధం: పాక్ మంత్రి వెల్లడి: చక్రం తిప్పిన సౌదీ క్రౌన్ ప్రిన్స్?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పై విడుదలపై దేశ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. భారత్ పై ఉన్న పగను పాకిస్తాన్ అభినందన్ పై తీర్చుకుంటుందని, ఆయనను చిత్రహింసలకు గురి చేస్తుందంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. అభినందన్ తమ చేతికి చిక్కిన వెంటనే పాక్ బలగాలు ప్రవర్తించిన తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.

యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్ ను పాక్ అంత సులభంగా విడుదల చేయకపోవచ్చని, కుల్ భూషణ్ జాదవ్ తరహాలో న్యాయస్థానాల చుట్టూ తిప్ప వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ, గురువారం పాకిస్తాన్ ఓ సానుకూల ప్రకటన చేసింది.

Pakistan Foreign Minister says ready to return IAF pilot Abhinandan to ease India conflict

భారత వైమానిక దళ పైలెట్ అభినందన్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భారత్-పాక్ మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి తాము ఈ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

భారత్ తో చర్చల వాతావరణాన్ని పునరుద్ధరించుకోవడంలో భాగంగా.. తాము బేషరతుగా అభినందన్ ను విడుదల చేస్తామని ఖురేషీ చెప్పారు. ఎప్పుడనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

Pakistan Foreign Minister says ready to return IAF pilot Abhinandan to ease India conflict

సౌదీ క్రౌన్ ప్రిన్స్ దౌత్యం ఫలితమా?

అభినందన్ వ్యవహారంలో పాకిస్తాన్ తన వైఖరిని ఇంత త్వరగా మార్చుకోవడానికి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చక్రం తిప్పారని తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ఉటంకిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే సల్మాన్.. పాకిస్తాన్ లో పర్యటించారు. ఆ వెంటనే భారత్ లోనూ ఆయన అడుగు పెట్టారు. పాకిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సల్మాన్ ప్రకటించారు. సుమారు 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ఒప్పందాలపై సల్మాన్ సంతకాలు కూడా చేశారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను సౌదీ అరేబియా ప్రకటించడం ఇదే తొలిసారి.

అనంతరం ఆయన భారత పర్యటనకు కూడా వచ్చారు. అటు భారత్, ఇటు పాకిస్తాన్ లతో స్నేహ సంబంధాలను కొనసాగించడానికి సౌదీ అరేబియా సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు కూడా. ఇందులో భాగంగా.. ఆయన తెర వెనుక చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రెండు దేశాలూ తనకు బాగా కావాల్సినవేనని, భారత్ తో కయ్యం వద్దని సల్మాన్.. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను సూచించినట్లు చెబుతున్నారు. ఆయన మాటకు విలువ ఇస్తూ, పాకిస్తాన్.. అభినందన్ ను విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

English summary
Islamabad: Pakistan would be prepared to return Indian Air Force (IAF) pilot—Wing Commander Abhinandan Varthaman—shot down and captured this week if it helped ease the conflict with its neighbour, foreign minister Shah Mahmood Qureshi told Pakistani television on Thursday. "We are willing to return the captured Indian pilot if it leads to de-escalation," he was quoted as saying. He also said the Saudi foreign minister was expected to visit Pakistan with a special message from Crown Prince Mohammed Bin Salman, who visited both Pakistan and India earlier this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X