టెక్కీలకు షాక్: అమెరికా నుండి స్వదేశానికి వందలాది మంది ఇండియన్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియన్లపై తీవ్రంగా కన్పిస్తోంది. వేలాది మంది ఇండియన్లు అమెరికా నుండి తిరిగిరావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్ లో ఉండడంతో సుమారు 50 వేల మంది అమెరికాను విడిచి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

టెక్కీలకు శుభవార్త: ఈ ఏడాది ఐటీలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారు.

టెక్కీలకు శుభవార్త: 2018 లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు

బై అమెరికన్, హైర్ అమెరికన్ కారణంగా వేలాది మంది ఇండియన్ టెక్కీలపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. హెచ్ 1 బీ వీసా నిబంధనలను కూడ కఠినతరం చేయడంతో కూడ ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

అమెరికా నుండి 50 వేల మంది వెనక్కి

అమెరికా నుండి 50 వేల మంది వెనక్కి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల కారణంగా అమెరికా నుండి సుమారు 50 వేలకు పైగా మంది ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు భావిస్తున్నారు.' బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌', హెచ్‌-1బీ వీసాలు కఠినతరం కావడం, గ్రీన్‌ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఈ పరిస్థితి నెలకొందంటున్నారు నిపుణులు.

ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం

ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నిర్ణయం తీసుకొంటానని ట్రంప్ ప్రచారం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని ట్రంప్ నెరవేర్చాడు. బై అమెరికన్, హైర్ అమెరికన్ పేరుతో ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ప్రధానంగా ఇండియన్ టెక్ కంపెనీలపై చూపుతోంది.దీంతో ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు కూడ అనివార్యంగా స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో ఉండాల్సిన పరిస్థితులు లేకపోవడంతో ఐటీ నిపుణులు భారీగా ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితులు కూడ లేకపోలేదు. దీంతో ఐటీ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు

హెచ్ 1 బి వీసాల పొడిగింపు కూడ కష్టం

హెచ్ 1 బి వీసాల పొడిగింపు కూడ కష్టం

డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనలతో హెచ్‌-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది. దీంతో 50వేలకు పైగా వరకు భారతీయ హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. వీసా సంబంధిత సమస్యలపై సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రి బాడీ నాస్కామ్‌, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్‌, అడ్మినిస్ట్రేషన్‌తో చర్చిస్తున్నారు.

నిబంధనలు కఠినతరం

నిబంధనలు కఠినతరం


నిబంధనలు కఠినంగా మారడంతో ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారతీయ వర్కర్లకు హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు, శాశ్వత సభ్యత్వం కోసం పొందే గ్రీన్‌కార్డులు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్‌ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్‌-1బీ వీసాలకు రెండు మూడేళ్ల పొడిగింపు ప్రకియ్ర కూడ నిబంధనలు అడ్డుగా మారుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In sync with the "Buy American, Hire American" vision, the Trump administration is deliberating on a proposal which may result in large scale deportation of Indians from the US.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి