వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లైట్ రెండు ముక్కలు: తామే కూల్చామని ఇస్లామిక్ స్టేట్

By Pratap
|
Google Oneindia TeluguNews

కైరో: విమానం కూలిన స్థలం నుంచి వంద మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. విమానం రెండు ముక్కలు కాగా చాలా మంది మరణించారని, కొందరు కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే ప్రాణాలు వదిలారని వారు చెప్పారు. విమానాన్ని తామే కూల్చామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. శవాలను వెలికి తీశారు. విమానంలోని ప్రయాణికుల్లో ముగ్గురు తప్ప అందరూ రష్యన్లే.

దర్యాప్తునకు ఆదేశం

తమ దేశానికి చెందిన విమానం ఈజిప్లులోకూలిపోయిన సంఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. కుప్పకూలిన ఎయిర్‌బస్ 321 విమానం రష్యాకు చెందిన కొగలిమావియా విమానయాన సంస్థకు చెందింది. ప్రమాదంపై రష్యా అధికారులు ఉన్నత స్థాయి కమిటీని నియమించి దర్యాప్తునకు ఆదేశించారు.

విమానయాన సంస్థపై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతారు. ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 23 నిమిషాల లోపలే సినాయ్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

రష్యా విమానం కూలిన ప్రదేశంలో శకలాల నుంచి కేకలు వినిపిస్తున్నాయని ఘటనా స్థలంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. ప్రమాదంలో రెండు ముక్కలైన విమానం నుంచి ఐదుగురు పిల్లల మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు.

మరో విమాన భాగం నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. విమాన ప్రయాణికుల్లో 90 శాతం మంది రష్యా పర్యాటకులు కావడం గమనార్హమని ఆయన అన్నారు. ప్రమాదం ఉగ్రవాదుల చర్య కాదని ఈజిప్టు అధికారులు అంటున్నాీరు.

టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ పరిధికి అందకుండా పోయింది. విమానం సైప్రస్ మీదుగా వెళ్తూ గల్లంతైనట్లు భావిస్తున్నారు. అంతలోని సినాయ్‌లోని హోసన్నా ప్రాంతంలో శకలాలను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

English summary
A Russian plane with 224 people on board crashed in a mountainous part of Egypt's Sinai Peninsula on Saturday, with medics at the site reporting casualties, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X