వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా యుద్ధ విమానాలను మెషిన్‌గన్స్‌తో పేల్చలేము.! ప్లీజ్ సాయం చేయండి !! : జెలెన్‌స్కీ భావోద్వేగం..

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా ఏమాత్రం తగ్గడం లేదు. క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. నగరాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అటు అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున్న యుద్ధ సామాగ్రితో మాస్కో బలగాలను ఉక్రెయిన్ దళాలు అడ్డుకుంటున్నాయి. రష్యా దాడులను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఆయుధాలను పంపించడంలో నాటో దేశాలు ఎందుకు తాత్సారం చేస్తున్నాయన్నారు. రష్యా సేనలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమకు ఆయుధాలను పంపించాలని పశ్చిమ దేశాలను మరో సారి విజ్ఞప్తి చేశారు

 నాటోను రష్యా నడుపుతోందా?

నాటోను రష్యా నడుపుతోందా?

అసలు నాటో ఏం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశ్నించారు... దానిని ఏమన్నా రష్యా నడుపుతోందా అని నిలదీశారు. రష్యా తమ దేశంపై దురాక్రమణకు దిగి 31 రోజులు దాటాయి. అయినా వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అర్థం కావడంలేదని అసహం వ్యక్తం చేశారు.. ఐరోపాలో స్వేచ్ఛ‌ను కాపాడగల భారీ ఆయుధాలు గోదాముల నిల్వల్లో దుమ్ముతో పేరుకుపోయి ఉన్నాయని విమర్శించారు. నాటో వద్ద ఉన్న ఆయుధాల్లో ఒక్క శాతం మాత్రమే తాము అడుగుతున్నామని పేర్కొన్నారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు సాయం చేయాలని జెలెన్ స్కీ భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. ఇప్పటికే ఉక్రెయిన్ నగరాలను రష్యా బలగాలు శ్మశానంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 లివీవ్‌పై రష్యా క్రూయిజ్ క్షిపణులు

లివీవ్‌పై రష్యా క్రూయిజ్ క్షిపణులు

మరో వైపు రష్యా సేనలు .. లివీవ్‌పైనా బాంబులతో విరుచుకుపడుతోంది. అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను ఈప్రాంతంలో ప్రయోగిస్తోంది. క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు స్వయంగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ దళాల ఇంధన డిపోను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే రాడార్ స్టేషన్లు, యాంటీ-ఎయిర్ క్రాప్ట్ సిస్టమ్‌లు , ట్యాంకులు రిపేర్ చేసే ప్లాంట్‌పై కూడా ఈ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లు చెప్పింది.

 చమురు, ఆహార సరఫరాలపై దాడులు

చమురు, ఆహార సరఫరాలపై దాడులు

అటు రష్యా దళాలు అంత్యంత కిరాతంగా వ్యవహరిస్తున్నాయని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారల మంత్రి వాడిమ్ డెనిసెంకో ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు అందించే మానవతా సాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు చేరే చమురు, ఆహార సరఫరాలను మాస్కో దళాలు ధ్వంసం చేస్తుయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ సరిహద్దులలో రష్యా కొత్త బలగాలను దించుతోందని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరమైన క్షిపణులతో దాడులు చేస్తూ నగరాలను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. రష్యాను సేనలను ప్రతిఘటించేందుకు ఐరోపా దేశాలు యుద్ధసాయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Ukrainian President Zelensky has questioned whether Russia is running NATO ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X