సౌదీపై క్షిపణిదాడి, ఎవరు చేశారంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

రియాద్: కల్లోలిత యెమన్‌ నుంచి దేశ రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ధృవీకరించారు. ఇరాన్‌ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్‌ తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.

రియాద్‌పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

Saudi Arabia's defence force intercepts ballistic missile fired from Yemen

భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మిస్సైల్‌ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు చెప్పారు.ఈ ఏడాది జులైలో కూడా యెమెన్‌ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.

సౌదీ అరేబియాలోని రియాద్‌ విమానాశ్రయమే లక్ష్యంగా క్షిపణి దాడి జరిగింది. యెమన్‌లోని హౌతీ రెబల్స్‌ ఈ దాడికి పాల్పడ్డారు. సకాలంలో పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థ స్పందించి ఆ క్షిపణిని దారిలోనే కూల్చివేసింది. సౌదీలోని అత్యంత కీలకమైన రియాద్‌ నగర ఎయిర్‌పోర్టు లక్ష్యంగా క్షిపణిదాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

మరోపక్క ఈ క్షిపణి దాడిని తామే చేశామని యెమన్‌లోని హౌతీ ఆధీనంలోని ప్రభుత్వ మంత్రి ప్రకటించారు. సౌదీ రాజధానిని షాక్‌కు గురిచేయడానికే ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడికి దేశీయంగా తయారు చేసిన బుర్ఖన్‌ 2హెచ్‌ అనే దీర్ఘశ్రేణి క్షిపణిని వాడినట్లు తెలిపారు. ఇటీవల యెమన్‌ రాజధాని సనాపై సౌదీ సంకీర్ణదళాల దాడికి ప్రతిస్పందనగా రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

రియాద్‌ విమానాశ్రయం సురక్షితంగా ఉందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడి వల్ల విమానాల రాకపోకల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. 2015 తర్వాత సౌదీపై ఈ స్థాయిలో దాడి జరగటం ఇదే తొలిసారి. ఈ ఘటనతో సౌదీ యెమన్‌ మధ్య విభేదాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉగ్రవాదులకు మద్దతు పలికే దేశాలే హౌతీ రెబల్స్‌కు సహకరించాయని పరోక్షంగా ఇరాన్‌ను నిందించింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.07కు యెమన్‌ రెబల్స్‌ క్షిపణిని ప్రయోగించారు. ఇది రియాద్‌ వైపు దూసుకువస్తుండగా పేట్రియాట్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ దీనిని అడ్డుకొంది. దీంతో విమానాశ్రయానికి తూర్పున ఓ నిర్మానుష్య ప్రదేశంలో యెమన్‌ క్షిపణి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సౌదీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Saudi Arabia's air defence forces intercepted a ballistic missile fired from Yemen over the capital Riyadh on Saturday, state news agencies reported.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి